దొంగ‌త‌నం చేసి దొర‌క్కుండా ఉండేందుకు ప‌ది కిలోలు త‌గ్గిన వ్య‌క్తి.. అయినా..

ఒక‌ప్పుడు పురుషులందు పుణ్య పురుషులు వేరయాఅ ని చెప్పుకునే వాళ్లం.కానీ ఇప్పుడు మేం చెప్పే విష‌యం వింటే దొంగ‌లందు ఈ దొంగ వేరయా అని చెప్పుకోవాల్సి వ‌స్తుందేమో.

 A Person Who Loses Ten Kilos To Avoid Being Stolen And Found, Lose Waight, Viral-TeluguStop.com

ఎందుకంటే ఇత‌గాడు చేసిన ప‌ని అంత విచిత్రంగా ఉంది మ‌రి.ఎవ‌రైనా బ‌రువు ఎందుకు త‌గ్గాల‌నుకుంటారు.

స‌న్న‌గా అందంగా క‌నిపించాల‌ని క‌దా.కానీ ఇత‌ను మాత్రం అందుకు భిన్నంగా దొంగ‌త‌నం చేసేందుకు ఇలా బ‌రువు త‌గ్గాడు.

అది కూడా కిలో రెండు కిలోలు కాదండోయ్‌.ఏకంగా ప‌ది కిలోల వ‌ర‌కు త‌గ్గి అంద‌రికీ షాక్ ఇచ్చేశాడు.

ఇంత‌కీ ఇతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ప‌ట్ట‌ణంలో నివ‌సిస్తున్న మోహిత్ మరాడియా మొద‌టి నుంచి సులువుగా డ‌బ్బులు సంపాదించాల‌ని ఆలోచ‌న‌లోనే ఉన్నాడు.

ఈ క్ర‌మంలోనే అత‌నికి ఓ ఆలోచ‌న వ‌చ్చింది.తాను ప‌నిచేసే ఇంట్లో ఉన్న సొమ్మును కాజేయాల‌ని అనుకున్నాడు.ఇంకేముంది ప్లాన్ రెడీ చేసుకున్నాడు.దొంగ‌త‌నం చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకుని రంగంలోకి దిగిపోయాడు.

ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఎలక్ట్రానిక్ డోర్ల నుంచి వెళ్లాలి.వేరే మార్గం నుంచి వెల్లి దొంగ‌త‌నం చేయాలంటే కుద‌ర‌దు.

Telugu Electonic Doors, Gujarat, Lose, Mohith Maradia, Thief Kilos, Thiefmohith-

కాగా వీటి నుంచి వెళ్లాలంటే సన్నబడాలని నిర్ణయించుకున్నాడు మోహిత్‌.ఇక త‌న‌కు వ‌చ్చిన‌ ఆలోచ‌న‌ను వెంట‌నే అమ‌లు చేసేందుకు రెడీ అయిపోయాడు.క‌చ్చిత‌మైన డైట్ ను స‌న్న‌బ‌డ‌టం కోసం పాటించ‌డం స్టార్ట్ చేశాడు.ప‌ది కిలోల బ‌రువు త‌గ్గి దొంగ‌త‌నం చేసేందుకు ఓ పరికరాన్ని కొన్నాడు.ముందుగా అనుకున్న‌ట్టే సీసీ కెమెరాల‌ను ధ్వంసం చేసి దొంగ‌త‌నం చేశాడు.ఎవ‌రికీ అనుమానం రాద‌నుకున్నాడు.

కానీ ఆ పరికరం కొనేందుకు అత‌ను వెళ్లిన దుకాణంలోని సీసీ కెమెరాల్లో అత‌ని ఆకారం రికార్డు అయింది.వీటి ఆధారంగా పోలీసులు అత‌న్ని ప‌ట్టుకున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube