నక్కకు ఫుడ్ పెట్టిన వ్యక్తి.. కట్ చేస్తే ఇంటిముందు నక్కల గుంపు ప్రత్యక్షం..

సాధారణంగా జంతువులు ఆహారం కోసం మనుషులను అడుగుతుంటాయి.ఏవైనా పెడితే తిని కడుపు నింపుకుంటాయి.

 A Person Gives Food To A Fox If He Cuts It, A Group Of Foxes Appear In Front O-TeluguStop.com

లేదంటే వేరే ఇంటికి వెళ్తాయి.అక్కడ దొరకకపోతే చెత్తకుప్పలలో మిగిలిపోయిన ఆహారాన్ని వెతుకొని ఆకలి తీర్చుకుంటాయి.

కొంతమంది ఈ మూగజీవుల పట్ల దయ తలచి ఎంతోకొంత ఆహారం పెడుతుంటారు.అయితే కొన్ని సందర్భాల్లో ఇలా ఆహారం పెట్టిన వాళ్ళు చిక్కుల్లో పడుతుంటారు.

ఎందుకంటే ఈ జంతువులు తమ కడుపు నిండిన తర్వాత తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా తీసుకొస్తాయి.తాజాగా ఇదే అనుభవం ఒక వ్యక్తికి ఎదురయ్యింది.

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

B&aS ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసిన ఈ వీడియోలో ఒక నక్క ఇంటిముందు ఉండటం మన గమనించవచ్చు.దాని వెనక ఒక పెద్ద నక్కల గుంపే కనిపించింది.చూసేందుకు ఇది ఫన్నీగా అనిపించింది.

అవన్నీ కూడా ఫుడ్ పెడతారా అన్నట్లు చూస్తూ ఉన్నాయి.అవి ఆకలిగా ఉండటం చూసి ఆ యజమాని బాగా ఫీల్ అయిపోయారు.

అనంతరం డోర్ తెరిచి బ్రెడ్ ముక్కల లాంటివి ఏవో వాటికి విసిరివేయడం మొదలుపెట్టారు.అవి ఆ బ్రెడ్ ముక్కలను చాలా కరెక్ట్‌గా పట్టుకోగలిగాయి.

విసిరే ఒక్కొక్క ముక్కను నోటితో ఒక్కొక్క నక్క పట్టుకొని ఆపై అక్కడ నుంచి వెళ్లిపోయి తినేసాయి.మొత్తం ఎనిమిది నక్కలు ఆహారాన్ని నోటకరచుకొని హాయిగా వెళ్లిపోయాయి.

ఈ నక్కలకు సంబంధించిన వీడియోకి ఇప్పటికే 13 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు కొందరు పేర్కొన్నారు.నక్కలు బ్రెడ్ ముక్కలు పర్ఫెక్ట్ గా క్యాచ్ చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ఇంకొందరు వ్యాఖ్యానించారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube