వివాహ వేడుకకు దేశభక్తిని జోడించారు ఓ యువజంట ఏలూరులో వినూత్న రీతిలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో బంధువులు రాజకీయ ప్రముఖులు ఆ యువ జంటను అభినందించారుఏలురులో నివాసముంటున్న ఏసుబాబు సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు తన కుమారుడు సూర్యతేజను కాకినాడకు చెందిన అమృతకిచ్చి నిన్న వివాహం చేశారు అయితే ఈరోజు రిసెప్షన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు స్వాతంత్ర దినోత్సవం కావడంతో వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ వివాహ రిసెప్షన్ కూడా వినూత్న రీతిలో జరుపుకోవాలని నిర్ణయించుకొని దేశభక్తిని పెంపొందించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు మాజీ ఎంపీ మాగంటి బాబు టిడిపి నేత బడేటి బుజ్జి అలాగే ఏలూరుకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు పెద్ద ఎత్తున దేశభక్తిని పెంపొందించే విధంగా రిసెప్షన్ ఏర్పాటు చేసిన వారి తల్లిదండ్రులను ఈ సందర్భంగా అభినందించారు ఏలూరు గ్రాండ్ కృష్ణ హోటల్లో జరిగిన వివాహ రిసెప్షన్ కు పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించి వారికి దేశంపై ఉన్న భక్తిని ప్రశంసించారు







