ఓటిటీ వైపు అడుగులు వేస్తున్న కొత్తతరం పెళ్ళిసందడి !

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి మరెన్నో మరుపురాని చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసాడు.ఆయన సినిమాలు వేరే స్టైల్ లో ఉంటాయి.

 Raghavendra Rao Pelli Sandadi Movie On Ott Site, Tollywood , Roshan , Sriukanth-TeluguStop.com

ఆయన సినిమాలో పాటలను చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తారు.ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో నటించే హీరోయిన్స్ ను కొత్తగా చూపించడమే కాకుండా పాటలకు అన్ని రకాల పండ్లను,పూలను వాడేసాడు.

అయితే ఆయన మరపురాని చిత్రాలలో బాగా గుర్తుండి పోయే చిత్రాలలో పెళ్లి సందడి ఒకరి.ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు.ఈ సినిమా అప్పట్లో ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి పాటలు కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.ఎంత హిట్ అయ్యాయంటే ఇప్పటికి ఈ సాంగ్స్ అంటే ఇష్టపడని వారు ఉండరేమో.

Telugu Pelli Sandadi, Raghvendra Rao, Roshan, Sriukanth, Tollywood-Movie

అయితే ఇప్పుడు పెళ్లి సందడి సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు రాఘవేంద్రరావు.కొత్త తరం జంటతో ఈ సినిమాను సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఈ సినిమాను మళ్ళీ అదే పేరుతో తెరకెక్కిస్తున్నారు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తుంటే తెలుగు అమ్మాయి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Pelli Sandadi, Raghvendra Rao, Roshan, Sriukanth, Tollywood-Movie

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి ఇప్పటికేరెండు సాంగ్స్ విడుదల అయ్యాయి.ఇప్పుడు ఆ సాంగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఈ సినిమాకు కూడా ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా చంద్రబోస్ లిరిక్స్ అందిస్తున్నాడు.

ఇప్పుడు ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ సినిమా కూడా ఓటిటీ లోకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితులు కారణంగా ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం లేనందున ఈ సినిమాను ఒటిటి లో రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తున్నారు.ఓటిటి లు కూడా ఈ సినిమాకు భారీగా ఆఫర్ చేయడంతో సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది.

మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు ఎలా రిలీజ్ అవుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube