ఇదేందయ్యా ఇది: మార్కెట్ లోకి కొత్తరకం మాస్క్..!

పాటించడం ప్రజలకి సర్వసాధారణమైపోయింది.అలాగే బయటికి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్క సారి చేతులను శానిటైజర్ చేసుకోవడం కూడా తప్పనిసరి వ్యవహారం అయిపోయింది.

 New Type Of Mask, Viral, Social Media, Netizens, Carona Virus, Covid 19-TeluguStop.com

ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అంటే కచ్చితంగా వారిని వారు కాపాడుకోవాలంటే కచ్చితంగా మాస్కు పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి.అయితే ఇన్ని రోజులు అలవాటులేని మాస్క్ ఇప్పుడిప్పుడే పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కొంతమంది ప్రజలు.

అలా పెట్టుకోవడం వల్ల చికాకు అనిపిస్తుందని చాలా మంది ఇప్పటికే తెలిపారు.అయితే ఇది అందరికీ ఉన్న ఇబ్బందే కాకపోతే ప్రస్తుత పరిస్థితి బట్టి తప్పదు.

మరి కొంతమంది ఇలా పెట్టుకోవడం ద్వారా ఊపిరి ఆడటం లేదని, చెమట ఎక్కువ పడుతుందని ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుపుతున్నారు.కారణం ఏదైనా సరే, ముఖానికి మాస్క్ లను పెట్టుకోవడం అంటే చాలామంది ఇష్టపడట్లేదు.

ఇకపోతే ఇలాంటి వారికోసం ఓ యువజంట సరికొత్త క్రియేటివిటీ మాస్క్ ను తయారుచేసింది.ఇందుకు ఓ ప్లాస్టిక్ మాస్క్ కవచాన్ని తయారు చేసింది ఆ జంట.వీటిని ధరించడం ద్వారా పూర్తిగా ట్రాన్స్పరెంట్ ఉండటమే కాకుండా… అలాగే తల మొత్తం కవర్ అయ్యే విధంగా వీటిని రూపొందించారు.వీటిని ధరించడం ద్వారా ముక్కు కు దూరంగా ఉండకపోవడంతో ఊపిరిని హాయిగా పీల్చుకోవచ్చు.

అయితే ఈ మాస్క్ ధరించి ఈ యువ జంట ప్రజలకు అవగాహన కల్పించడానికి రోడ్లపైకి వచ్చారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

కొందరి నెటిజన్స్ ఇలాంటి మాస్క్ మాకు కూడా కావాలని పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.ఈ మాస్క్ పెట్టుకోవడం ద్వారా మామూలు మాస్కుల వల్ల కలిగే ఇబ్బందులు కలగవని అలాగే నిలుచున్న, కూర్చున్న గాని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా దీన్ని రూపొందించారు.

మెడ కింద భాగం నుండి తల పై వరకు ఈ మాస్క్ కప్పబడి ఉండటంతో కరోనా వైరస్ ని సులువుగానే ఎదుర్కోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube