కరోనా నివార‌ణ‌కు కొత్త ఔష‌ధం.. కోర్సు ఎన్నాళ్లు? ధ‌ర ఎంతంటే..

దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది.నెల రోజుల వ్య‌వ‌ధిలో 1,700 కు మించిన ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.

 A New Drug For Corona Prevention. How Old Is The Course? What Is The Price, New-TeluguStop.com

అటువంటి పరిస్థితిలో కోవిడ్-19 నివార‌ణ‌కు త‌గిన‌ ఔషధం లేదా? ఉంటే అది సాధారణ ప్రజలకు ఎలా చేరుతుంది? దాని వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి ఔషధం ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంద‌నే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం వచ్చింది.కోవిడ్ -19 చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్ మాత్ర మోల్నుపిరవిర్ అత్యవసర అనుమతి పొందిన తర్వాత భారతదేశంలో అందుబాటులోకి వ‌చ్చింది.

కోవిడ్-19 సోకిన రోగుల చికిత్సలో మోల్నుపిరావిర్ ఉపయోగ‌ప‌డుతుంది.ఇది పునర్నిర్మింత‌ ఔషధం ఇది మాత్ర రూపంలో ల‌భ్య‌మ‌వుతుంది.రోగులు సులభంగా వాడ‌వ‌చ్చు.ఈ మాత్ర శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.

వ్యాధి నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది.ఐదు రోజుల కోర్సుతో మోల్నుపిరవిర్ రూ.1,399ల‌కు ల‌భ్య‌మ‌వుతుంది.

ఈ ఔష‌ధం గురించి మ్యాన్‌కైండ్ ఫార్మా ఛైర్మన్ ఆర్‌సి జునేజా మాట్లాడుతూ, ఈ ఔషధం అత్యంత‌ చౌకైన యాంటీవైరల్ డ్రగ్ అని, దీని ఒక టాబ్లెట్ రూ.35కి అందుబాటులో ఉంటుందని, 5 రోజుల కోర్సుతో మొత్తం కిట్‌ రూ.1399కి అందుబాటులో వ‌స్తున్న‌ద‌ని తెలిపారు.ఈ మోల్నుపిరవిర్ మాత్రలు మెడికల్ స్టోర్లలో విక్రయించాలని సిఫార్సు చేశారు.కొన్ని వైద్య సూచ‌న‌ల మేర‌కు దుకాణదారులు ఈ ఔష‌ధాన్ని విక్ర‌యించ‌నున్నారు.

Molnupiravir Tablets for Covid Victims

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube