వావ్‌.. చెమటతో కరెంట్‌ ఉత్పత్తి చేసే పరికరం!

ఇప్పటి వరకు థర్మల్, వాయు, బొగ్గు లేదా సోలర్‌ ప్లేట్ల ద్వారా కరెంట్‌ ఉత్పత్తి చేయడాన్ని చూశాం.కానీ, ఎక్కడైనా చెమటతో విద్యుత్‌ తయారు చేయడాన్ని చూశారా? ఇది నిజమండి! యూఎస్‌ సాన్‌ డియాగో జాకబ్స్‌ స్కూల్‌ ఇంజినీరింగ్‌ పరిశోధకులు ఈ వినూత్న ప్రయోగానికి తెర తీసారు.వారు ఫింగర్‌ టిప్‌కు స్టిక్‌ అవ్వగలిగే స్ట్రిప్‌ను తయారు చేశారు.ఇది వేలుకు సరిపోయేంగా, సన్నగా ఉంది.ఫింగర్‌ టిప్స్‌ చెమట పడితే దాని ద్వారా ఎలక్ట్రిసిటీగా మారి దాన్ని చిన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అందించడానికి ఉపయోగపడుతుంది.ఇది అమర్చుకున్నప్పుడు మన ఫింగర్‌కు ఎప్పుడు చెమట పట్టినా అది విద్యుత్‌గా మార్చేస్తుంది.

 A New Device Could Turn Your Sweat Into Electricity , Charged With Sweat, Piano,-TeluguStop.com

ఇది చాలా సులభంగా ధరించవచ్చు.పడుకునేటప్పుడు కూడా దీన్ని వేలుకు పెట్టుకుని పడుకోవచ్చు.

ఈ డివైజ్‌పై ప్రెస్‌ చేస్తే ఎక్కువ పవర్‌ కూడా ఉత్పత్తి అవుతుంది.అంటే మీరు కంప్యూటర్‌ వర్క్‌ చేసుకునేటపుడు లేదా పియానో వాయించేటపుడు కూడా దీన్ని ధరించవచ్చు.

మాములు కంటే పవర్‌ కాస్త ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కూడా.ఇది వరకు చెమట ద్వారా ఉత్పత్తి అయ్యే పరికరాలను కనుగొన్నారు.

కానీ, వాటికి మీరు ఎక్సర్‌సైజ్‌ చేస్తేనే పవర్‌ ఉత్పత్తి అయ్యేవి.కానీ, ఈ పరికరానికి అవసరం లేదు.

మామూలుగా ప్రతిరోజూ పనులు చేసుకుంటూ వాడచ్చు.ఇది ఇతర పరికరాల కంటే వాడటం సులభం అని నానో ఇంజినీరింగ్‌ పీహెచ్‌డీ స్టూడెంట్,కోఫస్ట్‌ అథార్‌ లూయీన్‌ తెలిపారు.

వీరి పరిశోధనలను జూలై 13న జౌల్‌ జర్నల్‌లో ప్రచూరించారు.

దీనిపై లూయీన్‌ మాట్లాడుతూ.మనకు సాధారణంగా చమట శరీరంలోని రంధ్రాల్లో సరిగా గాలి ఆడకపోతే వస్తుంది.ఫింగర్‌ పట్టే చెమట గాలికి ఆవిరిగా మారుతుంది.

ఇలా ఆవిరి కాకుండా ఆ చెమటతో కొద్దిపాటి ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చన్నారు.

ఈ డివైజ్‌ను మనం గాయపడినపుడు వేసుకునే బ్యాండేజ్‌ మాదిరిగా ధరించాలి.

అప్పుడు దీనిలో ఉండే ఎలక్ట్రోడ్స్‌ చెమటను గ్రహిస్తాయి.అది ఎలక్ట్రికల్‌ ఎనర్జీగా మారుతుంది.

మనం పడుకునేటపుడు ఓ పది గంటలపాటు ఈ పరికరాన్ని ధరిస్తే 400 మిల్లీజౌల్స్‌ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని యూనివర్శిటీ టీం తెలిపింది.ఒక గంట పాటు ఈ పరికరం వాడి కంప్యూటర్‌ టైపింగ్‌ చేస్తే ఒక ఫింగర్‌తో 30 మిల్లీజౌల్స్‌ ఉత్పత్తి అవుతుంది.

మరి పది ఫింగర్స్‌తో పదింతలు ఎక్కువ కరెంట్‌ ఉత్పత్తి అవుతుందని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube