యూఎస్: భారతీయులకు శుభవార్త, కొత్త బిల్లుతో గ్రీన్‌కార్డ్ కోసం వెయిటింగ్‌కు స్వస్తి

అమెరికా కల నెరవేర్చుకునే ప్రస్థానంలో చివరి మజిలీ గ్రీన్ కార్డు.హెచ్ 1 బీ సహా ఇతర వీసాల సాయంతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వలసదారులకు గ్రీన్ కార్డు వస్తే ఇక జీవితంలో ఎలాంటి చీకూ చింతా వుండదు.

 A New Bill In The Us Might Help Indians Jump The Queue For Green Cards , Green C-TeluguStop.com

అయితే అది అనుకున్నంత తేలిక కాదు.ఎందుకంటే అమెరికాకు వచ్చే వలసల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.

దీంతో గ్రీన్ కార్డుల కేటాయింపు ఆ దేశ ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది.ఇతర దేశాల సంగతి పక్కనబెడితే.

గ్రీన్ కార్డుల కోసం ఎక్కువగా పడిగాపులు కాస్తోంది భారతీయులే.తీవ్రమైన పోటీ నేపథ్యంలో గ్రీన్‌కార్డులపై కోటా తీసుకొచ్చింది అగ్రరాజ్యం.

దీని ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం చొప్పున గ్రీన్‌కార్డులు జారీ చేస్తూ వస్తోంది అమెరికా.ఈ విధానంలో తక్కువ జనాభా వున్న దేశాలకు ఎక్కువగా గ్రీన్ కార్డులు మంజూరవుతుండగా.

భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు ఏడు శాతం నిబంధన ప్రకారం కేటాయించే గ్రీన్‌కార్డులు ఏ మూలకు సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయులకు ఊరట కలిగించే పరిణామాలు జరుగుతున్నాయి.

ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త బిల్లు ప్రకారం.గ్రీన్‌కార్డుల పొందడం సులభతరం కానుంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.భారతీయ ప్రవాసులు సప్లిమెంట్ ఫీజు (సూపర్ ఫీజుగా పరిగణిస్తారు) చెల్లింపు ద్వారా గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్ క్యూను దాటవచ్చట.

portion of the Reconciliation Bill ప్రకారం.21 సంవత్సరాలు నిండిన వారు హెచ్ 1 బీ వీసా హోల్డర్ల పిల్లలు శాశ్వత నివాసం, పౌరసత్వం పొందే అవకాశం వుందని ఆ కథనంలో పేర్కొన్నారు.గత నెల చివరిలో అమెరికా కాంగ్రెస్ సభ్యులు.భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌కు సంబంధించి ఈ బిల్లు ప్రవేశపెట్టారు.ఇది చట్టంగా ఆమోదించబడితే ప్రస్తుతం వేధిస్తున్న గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Telugu Indiansjump, China, Green, India, Joe Biden-Telugu NRI

బిల్లు ప్రవేశపెట్టే సందర్భంగా రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ.ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించడానికి ఇమ్మిగ్రేషన్ ప్యాకేజ్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌ను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమెర్‌కు లేఖ రాశారు.

ఈ విషయంలో తనతో కలిసి రావాలని రాజా కృష్ణమూర్తి తన కాంగ్రెస్ సహచరులకు పిలుపునిచ్చారు.దీర్ఘకాలిక వలస ప్రాధాన్యతల నేపథ్యంలో దాదాపు 1.2 మిలియన్ల మంది గ్రీన్‌కార్డ్ అందుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube