రష్మి బండారం బయట పెడతానన్న నెటిజన్‌... దానికి రష్మి రియాక్షన్‌ ఏంటో తెలుసా?     2019-01-12   13:25:39  IST  Ramesh Palla

‘జబర్దస్త్‌’ కార్యక్రమంలో హాట్‌ యాంకర్‌గా చాలా పాపులర్‌ అయిన రష్మి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌తో చాలా బిజీగా ఉంది. ఈ అమ్మడు వెండి తెరపై, బుల్లితెరపై కనిపిస్తూ ప్రస్తుతం కెరియర్‌ను చాలా సాఫీగా సాగిస్తోంది. ఎంత బిజీ షెడ్యూల్‌ ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా పాల్గొంటుంది. అభిమానులకు ఇలా దగ్గరగా ఉంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానలు చెబుతూ మాంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.

A Netizen Wants To Release Rashmi Gautam Private Videos-Jabardasth Anchor And Anasuya Sudeer Viral About In Social Media

A Netizen Wants To Release Rashmi Gautam Private Videos

తాజాగా సాయి ప్రణీత్‌ చౌదరి అనే నెటిజన్‌ షాకింగ్‌ పోస్ట్‌ పెట్టాడు. త్వరలో రష్మి రాసలీలలను లీక్‌ చేస్తాను, ఆమె బండారం అంతా బయట పెడతాను అంటూ పోస్ట్‌ చేశాడు. దాంతో ఈ విషయంపై రష్మి చాలా సీరియస్‌గా స్పందించింది. నీ దగ్గర ఏ వీడియోలు ఉంటే అవి పెట్టేయ్‌, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి వాటిని స్వాగతిస్తున్న, నేను చాలా ధైర్యంగా పోస్ట్‌ చేయ్‌ అని అడుగుతున్న, సో నీ దగ్గర ఉన్న వీడియోలను పోస్ట్‌ చేసెయ్‌ అంటూ నెటిజన్‌కు షాకింగ్‌ రిప్లై ఇచ్చింది. రష్మి వ్యాఖ్యలకు గాను అంతా షాకవుతున్నారు.

A Netizen Wants To Release Rashmi Gautam Private Videos-Jabardasth Anchor And Anasuya Sudeer Viral About In Social Media

రష్మి అభిమానులు మాత్రం వద్దు భయ్య ఈ పోస్ట్‌ డిలీట్‌ చేయ్‌, ఈ గోల అంత అవసరమా? నీకు దండం పెడతాము అంటూ కామెంట్‌ చేశారు. దాంతో వారికి రిప్లై ఇస్తూ అతడిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా బ్లాక్‌ చేస్తే సరిపోతుంది అని కామెంట్‌ చేసింది. సదరు నెటిజన్‌ చేసిన పోస్ట్‌ను రష్మి చాలా లైట్‌గా తీసుకుంది. ఇకపోతే ఇదంతా ఆ వ్యక్తి పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడు అని రష్మి సన్నిహితులు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో రష్మి రాసలీలల విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.