రష్మికని చూడటం టైం వేస్ట్ అంటూ షాకిచ్చిన నెటిజన్.. వైరల్ కామెంట్?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తున్న బ్యూటీ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఒకరు.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.పైగా ఇండియన్ క్రష్ గా కూడా ఒక టైటిల్ సొంతం  చేసుకుంది.

 A Netizen Shocked Saying That Watching Rashmika Is A Waste Of Time Viral Comment-TeluguStop.com

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2016లో కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో పరిచయమైంది.ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఇక ఈ సినిమాతో తొలి నటనతో బాగానే మెప్పించింది.ఆ తర్వాత అదే ఏడాది గీత గోవిందం సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

ఇక అలా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా అందులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పొగరు వంటి సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక పాన్ ఇండియా మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ సంపాదించుకుంది.

ఇక ప్రస్తుతం పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా బాగా బిజీగా మారింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.

బాగా వర్కౌట్లు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను షేర్ చేసుకుంటుంది.తన పెట్స్ తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది.

ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

అప్పుడప్పుడు తన అభిమానులతో సరదాగా లైవ్ లోకి వచ్చి ముచ్చట్లు పెడుతుంది.కొన్ని కొన్ని సార్లు తనకు సంబంధించిన ఏదైనా ప్రశ్నలు వేయమని అభిమానులను అడుగుతుంది.అలా అభిమానులు దొరికిందే ఛాన్స్ అంటే తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటారు.

అడగరాని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు.

తన సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు తన ఫ్యామిలీ విషయాలను తెగ షేర్ చేసుకుంటుంది ఈ కన్నడ బ్యూటీ.

ఇక ఈ బ్యూటీ కేవలం సినిమాలలోనే కాకుండా అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటిస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేయించుకున్న ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

ఇక ఈ బ్యూటీకి బాగా ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి.ఎందుకంటే ఈ బ్యూటీ బయట చేసే హల్ చల్ అలా ఉంటుంది కాబట్టి.అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో తన ఎక్స్ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను ఫిదా చేసింది.ఇక ట్రోలర్స్ మాత్రం మళ్లీ తనను బాగా టార్గెట్ చేశారు.నెగిటివ్ కామెంట్లతో విమర్శిస్తున్నారు.ఓ నెటిజన్ మాత్రం.

ఈమెను చూడటం టైం వేస్ట్ అంటూ షాక్ ఇచ్చారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube