శ్రీకృష్ణుడి చిత్రాన్ని అత్యద్భుతంగా గీసిన ముస్లిం మహిళ.. ఆల‌యంలో ప్ర‌ద‌ర్శ‌న‌

భారతదేశం విభిన్న ఆచార వ్యవహారాలు, పద్ధతులు, భిన్న మతాలకు ఆలవాలం.కాగా, భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రజల వారసత్వంగా కొనసాగుతోంది.

 A Muslim Woman Who Painted A Picture Of Lord Krishna In An Outstanding Way Visit-TeluguStop.com

భారతీయులు ఆచరించే మతాలు వేరు అయినప్పటికీ భగవంతుడు ఒక్కడే అన్న భావన వారిలో ఉంది.ఈ నేపథ్యంలోనే హిందూ దేవుళ్లను ముస్లింలు పూజిస్తారు.

ముస్లిం దేవుళ్లను హిందువులూ పూజిస్తారు.మతంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు దేవుళ్లను ఆరాధిస్తుంటారు.

తాజాగా ఓ ముస్లిం మహిళ భగవాన్ శ్రీకృష్ణుడి చిత్రాన్ని అత్యద్భుతంగా గీసింది.ఆమె గీసిన చిత్రాన్ని అధికారులు ఆలయంలో ప్రదర్శించారు.

దాంతో సదరు ముస్లిం యువతి ఆనందపడుతోంది.ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే.

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన జస్నా సలీమ్ అనే ముస్లిం మహిళకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం.కొన్ని ఏళ్ల కిందటి నుంచి కృష్ణుడు చిత్రాలను గీస్తూ ఉంది.

ఇప్పటి వరకు ఐదొందలకుపైగా కృష్ణుడి చిత్రాలను గీసింది.అయితే, తాజాగా ఓ యువకుడు ఆమె చిరకల స్వప్నాన్ని నెరవేర్చాడు.

అదేంటంటే.తాను గీసిన కృష్ణుడి చిత్రం ఆలయంలో ప్రదర్శించబడటం.

కాగా, ముస్లిం మహిళ జస్నా గీసిన చిత్రం పండలంలోని ఉలనాడు కృష్ణస్వామి టెంపుల్‌లో ప్రదర్శనకు ఉంచారు.దాంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది.

తన ఆనందం వ్యక్తం చేయడానికి పదాలు లేవని, అధికారులకు థాంక్స్ చెప్పింది జస్నా.అయితే, ఈ ముస్లిం మహిళ కృష్ణుడి చిత్రం విషయం ఆలయ అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది.

సోషల్ మీడియా గ్రూపులోని ఓ యువకుడు యువతిని సంప్రదించి చిత్రాన్ని ఆలయంలో ప్రదర్శింపజేశాడు.ఇద్దరు పిల్లల మదర్ అయిన జస్నా సలీమ్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు కానీ స్కూల్ డేస్ నుంచి ఈమెకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమట.

అలా చిన్ననాటి డ్రాయింగ్ ఆర్ట్‌కు పదునుపెట్టి కృష్ణుడి అత్యద్భుత చిత్రాలను గీసింది జస్నా.చాలా మంది తనను శ్రీకృష్ణుడి చిత్రాల కోసం సంప్రదిస్తున్నారని ముస్లిం మహిళ జస్నా చెప్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube