కూతురు గురించి ఓ తల్లి సైకాలజిస్ట్ ని అడిగిన ప్రశ్న ఇది..! టీనేజ్ అమ్మాయిలు ఇలాగే ప్రవర్తిస్తారా?  

A Mother Worries About Teenage Daughter -

మా అమ్మాయి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది.చిన్నప్పటి నుంచీ తనకు స్కూల్‌ నుంచి రాగానే నాతో గడపడమే అలవాటు.

A Mother Worries About Teenage Daughter

ఇప్పుడు అలా కాదు.ఇంటికి వచ్చేయగానే, ఫోన్‌ పట్టుకుంటుంది.

ఛాట్‌ చేస్తూ కూర్చుంటుంది.లేకపోతే, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది.

పక్కనున్న నాకే వినపడనంత రహస్యంగా సంభాషిస్తుంది.టీనేజ్‌ అమ్మాయిలంతా ఇలానే ప్రవర్తిస్తారా? లేకపోతే, మా అమ్మాయిలోనే ఏదైనా లోపం ఉందా? నిజామాబాద్ కు చెందిన ఓ తల్లి సైకాలజిస్టును అడిగిన ఈ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే.

చిన్నప్పుడు ప్రతి అమ్మాయీ తనకు అమ్మే బెస్ట్‌ ఫ్రెండ్‌ అనుకుంటుంది.అమ్మతోనే ఎక్కువగా గడుపుతుంది.మీ అమ్మాయీ అంతే.తనిప్పుడు కాలేజీకి వచ్చింది.స్కూల్లో కన్నా కాలేజీలో స్వేచ్ఛ ఎక్కువ.స్నేహితులూ ఎక్కువే.

అలాగే వయసు ప్రభావం వల్ల వాళ్లు మాట్లాడుకునే విషయాలు మారిపోతాయి.కాబట్టి, అమ్మతో కాకుండా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు.

ఎక్కువ సేపు మాట్లాడతారు.ఫోన్లలో గుసగుసలు కూడా అందుకే.

ఇందులో మీరు భయపడాల్సిందేం లేదు.టీనేజ్‌ పిల్లలంతా ఇలాగే ఉంటారు.

కాకపోతే తనని మీరు పూర్తిగా విడిచిపెట్టకుండా, ఏదో రకంగా తనతో మాటలు కలుపుతూ ఉండండి.కొంత సమయం గడుపుతూ ఉండండి.

కాలేజీలో ఏం జరుగుతోందన్నది స్నేహితురాలిగా తెలుసుకుంటూ ఉండండి.కలిసి భోంచేయండి.

కలిసి బయటికెళ్లండి.మిమ్మల్ని తాను పూర్తిగా నమ్మగలిగేంత విశ్వాసం కలిగించండి.

అప్పుడు మీ అమ్మాయి దారి తప్పే ఛాన్సే ఉండదు.టీనేజ్ అనేది తెలిసీ తెలియని వయసు.

అంతేకాదు.

ఉద్వేగం తో పాటుగా ప్రకృతి ధర్మాల్లో ఒకటైన లైంగిక ఉద్రేకాలకు సంబంధించిన హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వయసు.అందుకే పెడసరి మార్గాలు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది.ఎవరయినా వారిని తమవైపు ఆకర్షితులుగా మార్చుకునే అవకాశాలూ ఉంటాయి.

ఈ క్రమంలోనే ఆకర్షణలనే ప్రేమలుగా భ్రమపడి దారితప్పే ముప్పు ఉంటుంది.ఇవన్నీ టీనేజర్లతో డీల్ చేయడం చాలా సున్నితంగా ఉంటుంది.

పూర్తిగా వదిలేయనూ కూడదు.అలా అని వారి కార్యకలాపాలను ఓ స్నేహితుడిలా తెలుసుకుని గైడెన్స్ ఇచ్చే ప్రయత్నమూ మానకూడదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Mother Worries About Teenage Daughter- Related....