సైకిల్ వెనుక సీటును తన కొడుకు కోసం స్పెషల్ గా ఏర్పాటు చేసిన తల్లి..... వీడియో వైరల్...

చిన్నపిల్లలను చూసుకునే విషయంలో తల్లి కంటే జాగ్రత్తగా ఎవ్వరూ చూసుకోలేరు.ఎందుకంటే చిన్న పిల్లలను ప్రతిక్షణం వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి.

 A Mother Who Arranged The Back Seat Of A Bicycle Specially For Her Son  Video Vi-TeluguStop.com

ఎందుకంటే చిన్న పిల్లలు ఒక చోట కుదురుగా ఉండరు.కాబట్టి వారి తల్లి ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలను వెంట తీసుకుని వెళ్ళవలసి వస్తుంది.

కొంతమంది మహిళలు నడుచుకుంటూ, మరికొంతమంది సైకిల్ పై కూడా వెళుతూ ఉంటారు.

సైకిల్ వెనక చిన్నారులను కూర్చోబెడితే వారు కింద పడిపోయే ప్రమాదం ఉంటుంది.

దీంతో ఓ తల్లి సైకిల్ పై తన కుమారుడిని తీసుకెళ్లడం కోసం చేసిన ప్రత్యేక ఏర్పాటు పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా దృష్టిని ఆకర్షించింది.ఆ మహిళ సైకిల్ పై తన కుమారుడిని తీసుకెళ్లిన వీడియోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి పిల్లల కోసం తల్లి చేయని పని ఏం ఉంటుందని చెప్పారు.

ఆ తల్లి సైకిల్ పై తన కుమారుడిని తన తో పాటే తీసుకెళ్లేందుకు వెనుక సీటుపై ఓ చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కట్టింది.ఆ కుర్చీలో తన కుమారుడిని కూర్చోబెట్టి సైకిల్ తొక్కుతూ వెళ్లింది.తన కొడుకు సైకిల్ వెనుక చేతిలో సౌకర్యవంతంగా కూర్చున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు తమ స్మార్ట్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

తొమ్మిది సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.ఆ మహిళ తెలివికి సెల్యూట్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

చిన్నారి సౌకర్యవంతంగా సైకిల్ వెనుక సీట్లో కూర్చునేందుకు ఆమె కనిపెట్టిన ఈ పద్ధతి అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.తన పిల్లలను జాగ్రత్తగా చూసుకునే విషయంలో తల్లికి సాటి ఎవరు రారని మరి కొంతమంది ఈమెను ప్రశంసిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube