పురిటిలోనే చనిపోయిన నలుగురు పిల్లలను 20 ఏళ్లు దాచుకున్న తల్లి... కన్నీరు పెట్టించే రియల్‌ స్టోరీ  

A Mother Hidden Her 4 Children For 20 Years After Their Death-before 1985,caring,children,death,general Telugu Updates,hidden,mother,red Box

 • జంతువులు కూడా తాము కన్న పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. సృష్టిలోనే అద్బుతమైనది కన్న ప్రేమగా చెప్పుకోవచ్చు.

 • పురిటిలోనే చనిపోయిన నలుగురు పిల్లలను 20 ఏళ్లు దాచుకున్న తల్లి... కన్నీరు పెట్టించే రియల్‌ స్టోరీ-A Mother Hidden Her 4 Children For 20 Years After Their Death

 • అలాంటి కన్న ప్రేమకు మనం ఎన్నో ఉదాహరనలు చూశాం. ఎంతో మంది అమ్మలు తమ ప్రాణాలు పోసి మరీ పిల్లలను కాపాడుకోవడం ఇప్పటి వరకు చూశాం.

 • అయితే ఒక తల్లి పురిటిలోనే చనిపోయిన తన పిల్లలను వదులుకోవడం ఇష్టం లేక 20 ఏళ్లు దాచుకుంది. శరీరాలు కుల్లిపోకుండా కొన్ని రసాయనాలు వాడుతూ ఏకంగా 20 ఏళ్లు దాచుకుంది. అప్పుడప్పుడు చూసుకుంటూ ఆ పిచ్చి తల్లి సంతోషించేది.

  గుండెను పిండేసే ఈ రియల్‌ స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే…

  బెర్నాడెట్‌ క్విర్క్‌ అనే మహిళకు 1985కు ముందు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. వారిద్దరు పుట్టిన తర్వాత మరో నలుగురు పిల్లలు జన్మించారు.

 • కాని వారెవ్వరు కూడా జీవించలేదు. అంతా కూడా పురుడులోనే చనిపోయారు.

 • చనిపోయిన పిల్లలపై మమకారంతో బెర్నాడెట్‌ ఆ పిల్లలకు అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే దాచి పెట్టింది. తనకు తెలిసిన సైన్స్‌ను ఉపయోగించి శవాలు కుల్లిపోకుండా రసాయనాలు వాడింది.

 • నలుగురు పిల్లలను కూడా వేరు వేరు డబ్బాలో పెట్టింది. అయితే ఒక రోజు ఒక కూతురు ఏదో అవసరంపై డబ్బాను తెరువగా అందులో శిషువు ఉంది.

 • దాంతో ఆమె అవాక్కయి తల్లిపై ఒత్తిడి తీసుకు వచ్చి ఆ శిషువకు అంత్యక్రిలు చేయింది.

  A Mother Hidden Her 4 Children For 20 Years After Their Death-Before 1985 Caring Children Death General Telugu Updates Hidden Mother Red Box

  తమ ఇంట్లో మరో మూడు శిషువులు ఉన్నట్లుగా వారు గుర్తించ లేక పోయారు. 20 ఏళ్లలో వారు మూడు ఇళ్లులు మారినా కూడా వాటిని క్యారీ చేస్తూనే వచ్చింది. ఆ డబ్బాల్లో ఏముందో చూసేందుకు ఎప్పుడు కూడా కూతుర్లు ప్రయత్నించలేదు.

 • అయితే ఒక ఎర్రటి డబ్బా పై తల్లి చాలా శ్రధ్ద చూపడంను గమనించిన కూతురు అందులో ఏముందు తెలుసుకోవాలనుకుంది. ఆమె లేని సమయంలో ఆ డబ్బును తెరిచి చూడగా అందులో మరో మూడు శిషు మృత దేహాలు ఉన్నాయి.

 • అవి 20 ఏళ్ల క్రితం పుట్టిన తన తల్లి పిల్లలు అని నిర్థారించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి తన తల్లిపై కేసు నమోదు చేసింది. తల్లి మతిస్థిమితం బాగా లేదు అంటూ కూతురు పోలీసులకు వెళ్లడించింది.

 • కాని ఆ తల్లి మాత్రం తన మతిస్థిమితం బాగానే ఉందని, పిల్లలపై ప్రేమతో అలా చేశాను, కడుపులో మోసిన పిల్లలను చనిపోయారని బయట పడేయడానికి తనకు మనసు ఒప్పలేదని, అందుకే వారిని భద్రపర్చాను, తాను ఎవరికి హాని తలపెట్టలేదు అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంటూ పోలీసులకు చెప్పడం జరిగిందట. ఈ విషయాలను బెర్నాడెట్‌ క్విర్క్‌ కూతురు రాసుకున్న తన బయోపిక్‌ లో పేర్కొంది.