రెండేండ్లుగా మెడ‌కు టైర్ వేసుకుని తిరుగుతున్న దుప్పి.. చివ‌ర‌కు

అడ‌వి అంటేనే స్వేఛ్చ‌కు మ‌రోపేరు.అడ‌విలో ఉండే జంతువుల‌కు ఉన్నంత స్వేచ్ఛ మ‌రెవ‌రికీ ఉండ‌దేమో అనిపిస్తుంది.

 A Moose With A Tire Around Its Neck To The End-TeluguStop.com

ఇక్క‌డ అన్ని జంతువుల త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఎలాంటి బంధ‌నాలు లేకుండా స్వేచ్ఛ‌గా సంచ‌రిస్తుంటాయి.అయితే ఇంత స్వేచ్ఛ న‌డుమ కూడా ఓ దుప్పి దాదాపు రెండేళ్లుగా న‌ర‌కాన్ని మెడ‌లో వేసుకుని తిరుగుతోంది.

ఆ పెను భారాన్ని భ‌రించ‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతూ కాలం వెళ్లదీస్తోంది.అస‌లు దానికి ఆ బ‌రువు ఎలా ప‌డిందో దానికి తెలియ‌దు గానీ ఆ భారాన్ని మాత్రం మోస్తూనే ఉంది.

 A Moose With A Tire Around Its Neck To The End-రెండేండ్లుగా మెడ‌కు టైర్ వేసుకుని తిరుగుతున్న దుప్పి.. చివ‌ర‌కు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా దాదాపుగా రెండేళ్ల పాటు అవ‌స్థ ప‌డుతోంది.మ‌రి ఇంత‌కీ దాని మెడ‌లో ఏముంద‌నే కదా మీ డౌటు.అదేంటంటే దాని మెడ‌కు అనుకోకుండా ఓ టైరు చిక్కింది.ఇంకేముంది దాన్ని ఎలా తీయాలో దానికి తెలియ‌క అలాగే దాన్ని మోస్తూనే ఉంటోంది.

అయితే ఇదిలా ఇబ్బంది ప‌డ‌టాన్ని కొలరాడో వన్యప్రాణి సంరక్షణ ఆఫీస‌ర్లు చూసి ఎలాగైనా దానికి విముక్తి క‌ల్పించాల‌ని చాలా శ్ర‌మించారు.ఏకంగా రెండేండ్ల పాటు ఆఫీస‌ర్లు దాన్ని ప‌ట్టుకునేందుకు నానా యాత‌న ప‌డ్డారు.

చివ‌ర‌కు రీసెంట్ గా దాన్ని ప‌ట్టుకున్నారు.అది కూడా ఈ నెల అక్టోబరు 9న వారికి చిక్కింది.

Telugu Moose, Scott Murdoch, Tire Around Its Neck, Two Yaears, Viral, Viral News, Wildlife Conservation Officers-Latest News - Telugu

కంటిన్యూగా రెండేండ్ల పాటు శ్రమిస్తున్న అధికారుల ప్ర‌య‌త్నానికి చివ‌ర‌కు ఫ‌లితం ద‌క్కింది.ఇక దాన్ని మత్తు మందు ఇచ్చి త‌మ దారిలోకి తెచ్చుకున్నారు.దాని మెడలో రెండేండ్లుగా ఆ టైరు ఇరుక్కుపోయిది.అయితే కాల క్ర‌మేణా దాని మెడ కూడా లావు కావ‌డంతో అది కాస్తా మెడ‌కు బ‌లంగా బిగుసుకుపోయింది.ఇక ఎలాగోలా క‌ష్ట‌ప‌డి దాన్ని త‌ప్పించారు.ఈ విష‌యాన్ని పార్క్‌ అధికారి స్కాట్‌ ముర్దోచ్ వివ‌రించారు.

ఆ దుప్పి త‌మ‌ను వారం నుంచి ముప్పుతిప్ప‌లు పెడుతోంద‌ని దొర‌కిన‌ట్టు దొరికి త‌ప్పించుకుంటోంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

.

#Moose #Neck #Yaears #Scott Murdoch

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు