కుక్క పిల్ల‌ను పెంచుకుంటున్న కోతి.. వీడియో వైర‌ల్‌

సోషల్ మీడియా.ఇదో విశాల ప్రపంచం.

 A Monkey Raising A Puppy Video Viral Details, Viral Video, Monkey , Puppy, Monke-TeluguStop.com

మనకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ మనకు లభిస్తాయి.ఈ విషయాలు కొన్ని మనం హాయిగా నవ్వుకునేలా ఉంటే కొన్ని మాత్రం మనలో భయాన్ని కలుగజేస్తాయి.

కానీ ప్రస్తుతం అనేక మంది సోషల్ మీడియాను మంచికంటే చెడుకే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.దీని వల్ల సోషల్ మీడియా అంటే కొంత మందిలో ఎందుకు పనికి రానిదనే భావన క్రియేట్ అయింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోతి కుక్క వీడియో చూస్తే మీకు తప్పకుండా ఆశ్చర్యం వేస్తుంది.కోతి కుక్క పిల్లను పెంచుకోవడం మాత్రమే కాకుండా దానికి తనే స్వయంగా ఆహారాన్ని తినిపిస్తుంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

కోతులకు కుక్కలకు మధ్య వార్ అనేది ఈనాటిది కాదు.

ఏళ్లుగా వీటి మధ్య శత్రుత్వం నడుస్తూనే ఉంది.ఈ మధ్యే ఒక ప్రాంతంలో కోతులు పగ బట్టి చాలా కుక్క పిల్లలను చంపేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఈ వార్త విని చాలా మంది ప్రజలు షాక్ అయ్యారు.మరీ ఇలా చేస్తాయా? అని ముక్కున వేలేసుకున్నారు.దీనికి సంబంధించి #MonkeyVsDog అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్విటర్ లో ట్రెండ్ అయింది.

చాలా మంది నెటిజన్లు ఈ వార్తను చదివి వామ్మో అనుకున్నారు.కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఓ ప్రాంతంలో ఓ కోతి కుక్క పిల్లను పెంచుకుంటుంది.

కోతి మరియు కుక్క కలిసి తిరగడం చూసిన జనాలు హే.ఇది కామనే అని అనుకున్నారట.కానీ రాను రాను ఆ కోతి నుంచి కుక్కను వేరు చేయాలని అక్కడి స్థానిక ప్రజలు చూసినపుడు అది ఎంతకూ కోతుల గుంపును వదిలి వెళ్లడం లేదని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube