పిల్లి మీద ద‌ర్జాగా ఊరేగుతున్న కోతి..

స్నేహం అంటే తెలియ‌ని మ‌నుషులు, జంతువులు ఉండ‌రేమో.మ‌నుషుల్లో ఈ బంధం ఎంత‌లా ఉంటుందో జంతువుల్లో కూడా ఈ బంధం అంతే స్ట్రాంగ్ గా ఉంటుందండి.

 A Monkey Marching On A Cat Viral On Social Media Details, Monkey, Cat , Monkey A-TeluguStop.com

జంతువులు కూడా త‌మ స్నేహితుల‌కు అంతే ప్రాముఖ్య‌త ఇస్తాయి.అయితే మ‌నుషుల కంటే జంతువుల్లో కొన్ని నిబంధ‌న‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి.

సాధార‌ణంగా ఏ జంతువు అయినా స‌రే త‌మ జాతికి చెందిన జంతువుల‌తోనే ఫ్రెండ్ షిప్ చేస్తాయి త‌ప్ప ఇత‌ర జంతువుల‌తో అస్స‌లు చేయ‌వు.కానీ ఈ మ‌ధ్య ఇందుకు భిన్నంగా ఇత‌ర జాతి జంతువుల‌తో కొన్ని జంతువులు స్నేహం చేస్తున్నాయి.

మొన్న‌టికి మొన్న ఓ కోతి కుక్క‌తో ఫ్రెండ్ షిప్ చేయ‌డాన్ని మ‌నం చూశాం.ఇప్పుడు ఓ పిల్లితో ఓ కోతి స్నేహం చేస్తోంది.

సాధార‌ణంగా ఈ రెండు జంతువులు ఒక‌దానికి ఒక‌టి ఎదురు కూడా ప‌డ‌వు.ఎందుకంటే రెండే విభిన్న‌జాతి జంతువులు.

ఒక‌దానికి మ‌రొక‌టి ప‌రిచ‌యం కూడా కావు.కానీ ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ కోతి ఎంచ‌క్కా ఓ పిల్లి వీపు మీద కూర్చుని ప్ర‌యాణిస్తోంది.

దాని మీద కూర్చుని ద‌ర్జాగా తిరిగేస్తోంది.ఇక ఆ పిల్లి కూడా ఆ కోతిని ఏమీ అన‌క‌పోవ‌డం ఇక్క‌డ మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే వీటి స్నేహం ఎలా చిగురించిందో ఎవ‌రికీ తెలియ‌దు.

కానీ  ఈ రెండు జంతువులు మాత్రం హాయిగా ఇలా స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి.ఈ వీడియోలో పిల్లి వీపు మీద ప‌డుకున్న కోతి.ఆ పిల్లి నెమ్మదిగా నడుస్తున్నంత సేపు ద‌ర్జాగా రైడింగ్‌ను చేస్తున్న‌ట్టు కూర్చుంది.

కానీ అనూహ్యంగా ఆ పిల్లి న‌డక‌లో వేగం పెంచడంతో ఆ కోతి కాస్త కంగారు ప‌డిన‌ట్టు ఉంది.వెంట‌నే పిల్లి మీద నుంచి కిందకు దూకేసింది.ఇక దీన్నంతా కొందరు వీడియో తీయ‌గా నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దీన్ని చూసిన వారంతా వాటే ఫ్రెండ్ షిప్ అంటూ ఫ‌న్నీగా కామెంట్లు పెడుతున్నారు.