6 నెలల ముందు నీటిలో పడిపోయిన మొబైల్ నుండి వచ్చిన మెసేజ్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

సాధారణంగా మనం సముద్రంలో గాని లేక సాధారణ మానవుడు అడుగుపెట్టలేని మరేతర ప్రదేశంలో గానీ వస్తువులను పోగొట్టుకుంటే ఇక అవి దొరకడం దాదాపు అసాధ్యం.చాలామంది తమ మొబైల్ ఫోన్లను నీటిలో పోగొట్టుకున్న వారు ఉన్నారు.అయితే పశ్చిమ కెనడాలోని వాంకోవర్ నగరానికి చెందిన ఫాతిమా జోహ్దాస్ అనే ఒక మహిళ కూడా తన ఫోన్ ని నీటిలో పడేసారు.2020 సెప్టెంబర్ నెలలో బ్రిటిష్ కొలంబియాలోని హారిసన్ సరస్సుపై బోట్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె తన ఐఫోన్ 11 ని పొరపాటున నీటిలో పడేసారు.క్షణాల్లోనే ఆ ఐఫోన్ సరస్సు అడుగు భాగానికి చేరుకుంది.

 A-message-from A Mobile Phone That Fell Into The Water 6 Months Ago What Is He R-TeluguStop.com

అయితే సరస్సు అడుగు భాగానికి చేరుకునే కొద్దీ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు చేరుకుంటుంది.

ఎవరైనా లోపలికి వెళితే నిమిషాల్లోనే రక్త నాళాలు చిట్లిపోయి చనిపోయే ప్రమాదం ఉంది.దీంతో ఆ యువతి తన ఐఫోన్ పై ఆశలు వదిలేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు.

అయితే సరిగ్గా ఆరు నెలల తర్వాత ఆమెకు తన పాత ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.దీనితో ఒక్కసారిగా షాక్ అయిన ఆ యువతి తన స్నేహితులు ప్రాంక్ చేస్తున్నారేమోనని అనుకున్నారు.

త్వరగా సరస్సు వద్దకు వచ్చి మీ మొబైల్ ఫోన్ మీరు వెనక్కి తీసుకు వెళ్ళండి అని మరొక మెసేజ్ రావడంతో ఆమె మరింత ఆందోళనకు గురయ్యారు.

ఎప్పుడో సరస్సులో పడిపోయిన ఫోన్ పని చేయటం ఏంటి? దాన్ని నుంచి మెసేజ్ రావటం ఏంటి? అని ఆమెలో అనేక ఆలోచనలు ఉత్పన్నమయ్యాయి.చివరికి ఏదైతే అదే అయింది అని ఆమె హారిసన్ సరస్సుకి చేరుకున్నారు.అక్కడే ఉన్న ఇద్దరు ఫ్రీడైవర్స్ ఆమెను చూడగానే వెంటనే పలకరించారు.అనంతరం తాము ప్రతిరోజు సరస్సు అడుగు భాగానికి చేరుకొని డ్రింక్ సీసాలు వంటి చెత్తాచెదారం క్లీన్ చేస్తామని ఒకరోజు యధావిధిగా శుభ్రం చేస్తున్న సమయంలో తమకు రెండు ఫోన్లు దొరికాయని వాటిలో ఒక ఫోన్ పని చేస్తున్నట్టు తాము తెలుసుకున్నామని చెప్పుకొచ్చారు.

అయితే ఆ ఫోన్ లో దొరికిన సమాచారం ప్రకారం దాని యజమాని మీరేనని తెలుసుకున్నామని ఫాతిమా తో చెప్పుకొచ్చారు.

వారి నిజాయితీకి ఫాతిమా మంత్రముద్దులయ్యారు.అలాగే పాత ఫోను మళ్లీ దొరకడంతో సంతోషం వ్యక్తం చేశారు.

సాధారణంగా ఐఫోను నీటిలో 30 నిమిషాల పాటు సర్వేవ్ చేయగలదని కంపెనీ చెబుతోంది.కానీ ఫాతిమా ఫోన్ మాత్రం ఆరు నెలలు నీటిలో ఉన్నా కూడా ఇప్పటికీ సక్రమంగానే పనిచేస్తోంది.

దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఐఫోన్ లో ఇంగ్రెస్ ప్రొటెక్షన్ ఉంటుందని అందువల్ల ఫాతిమా ఫోన్ ఆరు నెలలు నీటిలో ఉన్నా కూడా పాడై పోలేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube