సర్దార్ కోసం భారీ ఖర్చుతో సెట్స్ వేస్తున్న మేకర్స్..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి.

 A Massive Set Worth Rs 2 Crore For Karthis Sardar Movie-TeluguStop.com

ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.ఆవారా సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈ సినిమా ఇక్కడ మంచి హిట్ సాధించి భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది.కార్తీ సినిమా హిట్ టాక్ వస్తే ఇక్కడ కూడా మంచి వసూళ్లే రాబడుతాయి.
కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసాడు.నాగార్జున తో కలిసి ఊపిరి సినిమా చేసాడు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.ఈ మధ్యే ఈయన నటించిన సుల్తాన్ సినిమా విడుదల అయ్యింది.

 A Massive Set Worth Rs 2 Crore For Karthis Sardar Movie-సర్దార్ కోసం భారీ ఖర్చుతో సెట్స్ వేస్తున్న మేకర్స్..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాగానే వసూళ్లు సాధించింది.ఈ సినిమాలో కార్తీ సరసన హీరోయిన్ రష్మిక మందన్న నటించింది.

ఈ సినిమా తర్వాత కార్తీ మరొక సినిమాను అనౌన్స్ చేసాడు.

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడంలో కార్తీ ముందుంటాడు.

ఈ సారి కూడా కార్తీ ఒక విభిన్న కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది.తాజాగా కార్తీ ”సర్దార్” సినిమాను అనౌన్స్ చేసాడు.

ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఇది కొత్త స్టోరీ లైన్ తో రాబోతుందని అర్ధం అవుతుంది.కార్తీ లుక్ కూడా పూర్తిగా చేంజ్ అయ్యి కొత్తగా కనిపిస్తున్నాడు.

ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

సర్దార్ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నుండి వచ్చిన మోషన్ పోస్టర్ లో కార్తీ ఖైదీ గెటప్ లో ఉన్నాడు.

అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారట.

అందుకే ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారు.

ఈ సినిమా కోసం ఇప్పటికే ఒక భారీ జైలు సెట్ కూడా వేశారని వార్తలు వచ్చాయి.దీంతో పాటు 2 కోట్ల ఖర్చుతో మరొక సెట్ కూడా వేస్తున్నారని తాజాగా అందుతున్న సమాచారం.

ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.ప్రిన్స్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మరి చూడాలి ఈ సినిమాతో కార్తీ ఏ మేరకు మెప్పిస్తాడో.

#2 Crore #KarthiSardar #Karthi #Raashi Khanna #Sulthan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు