ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు( Extramarital Affairs ) బయటపడితే దారుణ హత్యలకు దారితీస్తున్న సంఘటన గురించి ప్రతిరోజు వింటూనే ఉన్నాం.అయితే ఓ వ్యక్తి తన భార్యకు ఉండే అక్రమ సంబంధం బయటపడడంతో దారుణాలకు పాల్పడకుండా గ్రామంలో తప్పెట్లతో ఊరేగింపు చేస్తూ విన్నూతంగా నిరసన చేపట్టాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయింది.ఇంతకీ ఆ భర్త గ్రామంలో ఎలా ఊరేగింపు చేశాడో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.శ్రీ సత్య సాయి జిల్లా ( Sri Sathya Sai district )మడకశిర మండలం క్యాంపురం గ్రామంలో అంజి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.
అంజి వివాహం చేసుకున్న తర్వాత కొద్ది రోజుల వరకు ఇతని సంసార జీవితం సాఫీగానే సాగింది.అయితే అంజి భార్యకు అదే గ్రామానికి చెందిన దివాకర్ అనే వ్యక్తితో పరిచయం అయింది.
వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలం వివాహేతర సంబంధాన్ని సాగించారు.అంజి కు తన భార్యపై అనుమానం రావడంతో భార్య ప్రవర్తన పై నిఘా పెట్టాడు.దివాకర్ తో తన భార్య సన్నిహితంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.
ఇద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇచ్చి, మరోసారి మీరు కలిస్తే బాగుండదు అని మందలించాడు.కొంతకాలం గడిచిన తర్వాత మళ్లీ అంజి భార్య, దివాకర్( Diwakar ) ను కలవడం మొదలుపెట్టింది.
ఇక ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

అంజి భార్య, ప్రియుడు దివాకర్ తో కలిసి లేచిపోవాలని నిర్ణయించుకొని, ఇంట్లో ఉండే తన వస్తువులు తీసుకుని దివాకర్ తో వెళ్ళిపోయింది.భార్య కనిపించకుండా పోవడం, దివాకర్ కూడా గ్రామంలో లేకపోవడంతో వీరిద్దరూ కలిసి లేచిపోయి ఉంటారని అంజి నిర్ణయించుకున్నాడు.తరువాత దివాకర్ ఫోటోను సైకిల్ కు తగిలించి, దివాకర్ ఫోటోకు చెప్పుల హారం వేసి, తప్పెట్లతో గ్రామమంతా ఊరేగించాడు.
తన భార్య దివాకర్ తో లేచిపోయిందని ఊరంతా ప్రచారం చేస్తూ విన్నుత్తంగా నిరసన తెలిపాడు.