ఏ నేరం చేయ‌కుండా 43ఏండ్లు జైలులో ఉన్న వ్య‌క్తి.. ఇన్నేండ్ల‌కు ఎలా తెలిసిందంటే..?

A Man Who Was In Jail For 43 Years Without Committing Any Crime Released

నేరం చేసిన వారికి శిక్ష ప‌డాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారు.కానీ న్యాయ వ్య‌వ‌స్థ‌లో అనేక ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి.

 A Man Who Was In Jail For 43 Years Without Committing Any Crime Released-TeluguStop.com

చాలామంది నేర‌గాళ్లు బ‌య‌టే తిర‌గ‌డం మ‌నం ఎప్ప‌టి నుంచో చూస్తున్నాం.అయితే నేర‌గాళ్లు కొన్ని సార్లు జైలుకు వెళ్లినా కూడా ఇంకొన్ని సార్లు బెయిల్ మీద బ‌య‌ట తిరుగుతుంటారు.

అయితే ఏ త‌ప్పు చేయ‌కున్నా కూడా కొంద‌రు జైళ్ల‌లో గ‌డుపుతుండ‌టం మ‌నం చాలా సార్లు చూస్తుంటాం.ఇప్పుడు కూడా ఇలాంటి వ్య‌క్తి గురించే మీకు చెప్ప‌బోతున్నాం.

 A Man Who Was In Jail For 43 Years Without Committing Any Crime Released-ఏ నేరం చేయ‌కుండా 43 ఏండ్లు జైలులో ఉన్న వ్య‌క్తి.. ఇన్నేండ్ల‌కు ఎలా తెలిసిందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇత‌నికి జ‌రిగిన విష‌యం తెలిస్తే మాత్రం అయ్యో పాపం అన‌క మాన‌రేమో.

ఏ త‌ప్పు చేయ‌ని వ్య‌క్తికి శిక్ష అంటే ఒక‌టి లేదా రెండేండ్ల వ‌ర‌కు శిక్ష అనుకుంటున్నారు క‌దా.

అలా అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే.అత‌ను ఏకంగా 43 ఏళ్ల వ‌ర‌కు జైలులోనే గ‌డిపేశాడు.

ఈ ఘ‌ట‌న ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిపోయింది.ఏ త‌ప్పు చేయ‌క‌పోయినా ఇన్నేండ్లు ఎలా జైలులో ఎలా ఉంచుతారంటూ చాలామంది మండిప‌డుతున్నారు.

కెవిన్ అనే వ్య‌క్తి ఒకానొక స‌మ‌యంలో ముగ్గురి హత్య కేసులో దోషిగా జైలు శిక్ష ఎదుర్కొన్నాడు.అయితే ఇన్నేండ్లుగా అత‌ను జైలులోనే ఉండ‌గా.

తాజాగా కోర్టు అత‌న్ని నిర్దోషిగా ప్ర‌క‌టించింది.

Telugu Jail, Kevin, Kevin Form Jail-Latest News - Telugu

ఓ ఇంట్లో ముగ్గురిని కొంద‌రు దుండ‌గులు దాడి చేసి చంపేయ‌డంతో ఆ స‌మ‌యంలో ఇంట్లో ఉన్న సింతీయ ఆ దాడి నుంచి త‌ప్పించుకుని త‌న ప్రాణాల‌ను నిల‌బెట్టుకుంది.అయితే ఆమె కెవిన్ పేరును చెప్ప‌డంతో వారు ఆయ‌న్ను అరెస్టు చేశారు.అయితే కొన్నాళ్ల త‌ర్వాత నిజం తెలిసినా అబ‌ద్ధం చెప్పినందుకు త‌న‌కు ఎక్క‌డ శిక్ష ప‌డుతుందో అని ఆమె చెప్ప‌లేదు.

ఇన్నేండ్ల త‌ర్వాత స్థానిక ప్రాసిక్యూటర్ ఈ కేసు మీద మ‌ళ్లీ పిటిషన్ వేయ‌డంతో కెవిన్ నిర్దోషిగా బ‌య‌ట ప‌డ్డాడు.దాదాపు ఆయ‌న య‌వ్వ‌నం మొత్తం జైలులోనే గ‌డిపేశారు.

#Jail #Jail #Kevin #Kevin Jail

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube