చేయని తప్పుకు 38 ఏళ్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి.. చివరకు..?!

ప్రస్తుత రోజుల్లో చేసిన తప్పునే కప్పిపుచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూంటారు కొందరు.కానీ ఒక వ్యక్తి మాత్రం తాను చేయని తప్పుకు ఏకంగా 38 సంవత్సరాలు జైల్లో శిక్ష అనుభవించాడు.

 A Man Who Spent 38 Years In Prison For A Mistake He Did Not Make Finally, Fribos-TeluguStop.com

ఇంతకు అతను ఎవరు అని అనుకుంటున్నారా.? అమెరికాలోని మిచిగన్‌ కు చెందిన 63 ఏళ్ల వాల్టెర్ ఫోర్బ్స్.కనీసం అతనికి కోర్ట్ పెరోల్ కూడా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వలేదు అంటే నమ్మండి.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.1982 లో డెన్నీస్ హాల్ అనే ఒక వ్యక్తి హత్యకు గురి అయ్యాడు.ఇది ఇలా ఉండగా కొన్ని రోజుల కిందట డెన్నీస్ హాల్, ఫోర్బ్స్ వేరొక వ్యక్తితో గొడవకు పాల్పడ్డారు.

ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే పోలీస్ కాల్పుల్లో డెన్నీస్ మృతి చెందడం జరిగింది.ఈ హత్య కేసులో భాగంగా ఫోర్బ్స్ ను పోలీస్ లు ప్రధాన నిందితుడిగా కోర్టులో హాజరు పరిచారు.

ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా అన్నీసె కెన్నబ్రూ అనే మహిళ డెన్నీస్ ను హత్య చేసింది ఫోర్బ్స్ అని కోర్టులో తెలిపింది.దీంతో ఆ మహిళ చెప్పిన మాటలకి కోర్టు అతడికి జీవిత ఖైదు శిక్ష విధించండి.

ఇది ఇలా ఉండగా, 2017 లో ఆ మహిళ మళ్లీ కోర్టుకు వచ్చి న్యాయస్థానం అధికారులకు ఒక షాకింగ్ న్యూస్ తెలియజేసింది.ఆరోజు నేను నిజం చెప్పలేదని ఈ కేసును ఫోర్బ్స్ నిర్దోషి అని తెలియజేసింది.

అయినా కానీ ఈ సారి ఆమె చెప్పిన విషయాన్ని కోర్టు నమ్మలేదు.ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించిన అనంతరం ఫోర్బ్స్ దోషా, కాదా అన్న విషయాన్ని తేల్చేయాలని కోర్టు అనుకుంది.

ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన వివరాలు మరోసారి శోధించాలని కోర్టు పోలీస్ అధికారులకు తెలిపింది.చివరకు ఈ కేసులో ఫోర్బ్స్ దోషి కాదని పోలీసులు కనుగోన్నారు.

కానీ, ఆ మహిళ ఇటీవల ఒక విషయాన్ని కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది.ప్రస్తుతం తాను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నానని, సంవత్సరాలుగా ఒక నిజాన్ని దాచి పెట్టానని ఇప్పటికైనా ఆ నిజాన్ని బయట పెట్టకపోతే ఆ పాపం నన్ను వెంటాడుతుంది అని స్పష్టంగా తెలియజేసింది.

ఆ రోజు ఏం జరిగింది అంటే.ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు.ఇందులో భాగంగానే ఆ వ్యక్తులు ఆ మహిళను దుండగులు బెదిరించారు.కోర్టులో మా పేర్లు చెబితే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఆ మహిళకు దుండగులు హెచ్చరించారు.

దీంతో ఆ మహిళ భయపడి కోర్టులో అదే విషయం తెలియచేసింది.అయితే ఆ వ్యక్తులు ఎవరు అన్నది ఇప్పటికీ కూడా ఆమె స్పష్టంగా చెప్ప లేకపోయింది.

దీంతో మరోసారి పోలీస్ అధికారులు జరిపిన విచారణతో ఫోర్బ్స్ నిర్దోషి అని స్పష్టంగా తేలడంతో కోర్టు అతడిని విడుదల చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube