షాకింగ్ వీడియో.. ఎత్తైన జలపాతం నుండి జారిపడిన వ్యక్తి

యువత అంటే ఉత్సాహం, శక్తి ఇంకా సాహసం.ఈ టెక్నాలజీ కాలంలో యువత చేయలేనిది అంటూ ఏమీ లేదు.

 A Man Who Slipped From A High Waterfall Viral Latest , Viral News, Social Media, Water Fall, Susong County, China, Jiujinggou-TeluguStop.com

అన్ని రంగాల్లోనూ పోటీపడి దూసుకెళ్తున్నారు.ఏదైనా సాహసం చేయాలంటే అంత ఈజీ కాదు.

దానికి ఎంతో శిక్షణ కావాలి.సరైన శిక్షణ లేకుండా సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వారి గురించి నిత్యం మనం సోషల్‌ మీడియాలో వింటూనే ఉన్నాం.

 A Man Who Slipped From A High Waterfall Viral Latest , Viral News, Social Media, Water Fall, Susong County, China, Jiujinggou-షాకింగ్ వీడియో.. ఎత్తైన జలపాతం నుండి జారిపడిన వ్యక్తి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా జలపాతల వద్దకు వెళ్తే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాల మీదకే వస్తుంటుంది.

నీటితో ఎలాంటి సాహసాలు చేయకూడదు.అలా సాహసం చేసిన ఓ వ్యక్తికీ సంబందించిన ప్రమాదకరమైన ఓ వీడియో బయటకు వచ్చింది.

ఈ వీడియోలో వ్యక్తి జలపాతంపై నుంచి కింది పడిపోయాడు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

వ్యక్తి కొండపై నుంచి జలపాతం వైపుగా వెళ్తుండగా, ప్రమాదవశాత్తు జారి కిందకు పడ్డాడు.ఇది చూసిన అక్కడున్న వారు భయంతో వణికిపోయారు.ఈ భయానక దృశ్యాన్ని చూస్తే తప్పకుండా అతని చనిపోయి ఉంటాడని భావించారు.కానీ అతనికి పెద్దగా గాయాలేమి కాకుండా బతికి బయట పడ్డాడు.

ఈ స్టంట్ చాలా ప్రమాదకరమైనది.ప్రస్తుతం ఆ వ్యక్తికి ప్రాణాలు పోయేంత గాయాలు కానట్లు తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియో చైనాలోని సుసోంగ్ కౌంటీలోని జియుజింగ్‌గౌలోని ఒక పర్యాటక ప్రదేశంలో జరిగింది.ప్రస్తుతం వీడియో చివరలో పడిపోయిన తర్వాత, వ్యక్తి రాళ్ల కొలనులోకి వెళ్లగలిగాడు.

అతని చుట్టూ నిలబడి ఉన్న వ్యక్తులు అతన్ని రక్షించారు.ఈ వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

వీడియో చూసిన యూజర్లు ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube