బావిలో పడిన పామును కాపాడడానికి దిగిన వ్యక్తి.. చివరకి..?!

పామును చుస్తే ఎవరైనా సరే భయంతో ఆమడ దూరం పెరిగెత్తాల్సిందే.దాని పని మీద అది వెళ్తున్న చూసి భయపడిపోతుంటాము.

 The Man Who Landed To Save The Snake That Fell In The Well Finally, Snake,. Well-TeluguStop.com

అయితే మనకు తెలిసినంత వరకు పాముల పట్టుకోవడం వంటి వీడియోలను డిస్కవరీ ఛానెల్ లో ఎక్కువగా చూస్తాము.ఇక కొంత మంది జంతువుల మీద ఉన్న ప్రేమతో ప్రమాదంలో ఉన్న వాటిని కాపాడుతున్న వీడియోస్ కూడా చూస్తుంటాము.

ఇక విష పురుగులు ప్రమాదంలో ఉన్న మనం చూసి చూడకుండా వచ్చేస్తుంటాము.ఎందుకంటే దగ్గరికి వెళ్తే అవి ఏమైనా చేస్తాయేమో అన్న భయం.

కొంతమంది దైర్యం చేసిన పాములను కాపాడే ప్రయత్నాలు చేసే వీడియోలు ఎప్పుడూ ఉత్కంఠగా ఉంటాయి.ఇక ప్రమాదకరమైన స్నేక్​లను పట్టుకోవడం కాస్త రిస్కే.

అయితే పాములను కాపాడేవారు, జంతు ప్రేమికులు.కష్టాల్లో ఉన్న వాటిని రక్షిస్తారు.అలాంటి ఘటనే తాజాగా జరిగింది. బావిలో పడి ఇబ్బందులు పడుతున్న పామును కొందరు యువకులు సాహసోపేతంగా రక్షించారు.

అయితే బావిలో పడిన పామును ఓ టెక్నిక్​తో యువకులు కాపాడారు.ఓ వ్యక్తి బావిలోకి దూకితే.మరొకరు బావి గోడకు మెట్లను ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీల సాయంతో నీటి సమీపంలో నిలబడ్డారు.నీటిలో ఈత కొడుతున్న పామును కడ్డీతో పట్టేసేలా ప్లాన్ చేశారు.

అందుకోసం ఓ వ్యక్తి నీటిలో దూకి.కడ్డీ పట్టుకొని ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లేలా పాము దారి మళ్లించేందుకు ప్రయత్నించారు.

ఇక పాము తన వైపునకు దూసుకొస్తున్నా.ఎంతో నేర్పుతో నీటిని చల్లుతూ పాముకు దారి చూపారు.కాసేపటికి ఇనుర చువ్వలపై నిల్చున్న వ్యక్తిని పాము సమీపించింది.దీంతో అతడు దాన్ని కడ్డీతో పట్టుకొని జాగ్రత్తగా బావి ఒడ్డుపైకి తీసుకెళ్లారు.

తర్వాత ఆ పామును ఓ ప్లాస్టిక్ బాటిల్​లో భద్రపరిచారు.ఆ తర్వాత దాన్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేశారు.

ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో చుసిన నెటిజన్స్ వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube