23 ఏళ్లుగా మీసాలను సాకుతున్న వ్యక్తి... ఇప్పుడెంత పెరిగాయో తెలుసా?

23 ఏళ్లుగా మీసాలను పెంచడమేమిటి పిచ్చికాకపోతే? అని తేలిగ్గా తీసిపారేయకండి.మనలో అతి కొద్దిమంది అందరికన్నా చాలా భిన్నంగా ఆలోచిస్తారు.

 A Man Who Has Been Growing A Mustache For 23 Years Do You Know How Much It Has G-TeluguStop.com

వారికి ఏదో ఒకవిషయంలో పేరు తెచ్చుకోవాలని ఉంటుంది.దీని కోసం చాలా శ్రమిస్తారు.

కొంత మందికి పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటే, మరికొంతమందికి పాటలు, ఇంకొంతమందికి ఆటలు… ఇలా ఎవరికి నచ్చిన రంగాలలో వారు పురోగతి సాధించాలని చూస్తూ వుంటారు.ఈ క్రమంలో చాలా తక్కువమంది వున్నత స్థాయికి చేరుకోగలుగుతారు.

దానికి అనేక కారణాలు అనుకోండి.

ఇకపోతే కొందరుంటారు… ఒకరికి చేతి గోళ్లను పెంచడం ఇష్టమైతే, మరికొంతమందికి వెంట్రుకలు పెంచడం ఇష్టముంటుంది.

ఈ కోవకే చెందుతాడు రాజస్థాన్ లోని కోటాలో ధన్నాలాల్ గుర్జార్ అనే వ్యక్తి.ఇతగాడు తన మీసాలను కొన్ని ఏళ్లపాటు పెంచి ప్రస్తుతం వార్తలలోకెక్కాడు.వివరాల్లోకెళితే, అతడికి సినిమాలంటే మహా పిచ్చి.సినిమాల్లోని విలన్లకున్నట్టు మీసాలు పెంచితే ఎలాగుంటుంది అనే ఆలోచన ధన్నాలాల్ ఒకసారి చేసాడు.

అనుకున్నదే తడవుగా ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు.అలా దాదాపు 23 ఏళ్లుగా మీసాలు తీయకుండా అట్లానే పెంచుకుంటున్నాడు.

ఈ క్రమంలో మీసాల పోటీలలో కూడా పాల్గొన్నాడు.ధన్నా లాల్ గుర్జర్ మీసాలు ఒక వైపు నుండి నాలుగున్నర అడుగుల పొడవు కలిగి, పొడవు మోకాళ్ల క్రింద వరకు వ్యాపించి ఉంటుంది.దాదాపు ప్రతిరోజు 2 గంటల పాటు మీసాలను దువ్వెనతో దువ్వడానికే కేటాయిస్తాడట.అంతే కాకుండా.మీసాలను సురక్షితంగా ఉంచడానికి, చొక్కాలో ఒకటిన్నర అడుగుల ప్రత్యేక పాకెట్ పెట్టుకొని తిరుగుతాడట.ఇక అతని కష్టం ఉట్టి పోతుందా? ధన్నా లాల్ చాలా పోటీలలో బహుమతులు గెలుపొందారు.2000 సంవత్సరంలో చివరిసారిగా మీసాలకు కత్తెర వేశానని ధన్నాలాల్ చెప్పాడు.ఇక ఆ తర్వాత 23 ఏళ్ల పాటు మీసాలు కత్తిరించనేలేదట.

దాంతో ప్రస్తుతం ఈ మీసాలతో ధన్నాలాల్ నిత్యం వార్తలలో వుంటున్నాడట.

https://dainik-b.in/9TVriLHk8wb
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube