ప్లాస్టిక్ బాటిల్స్‌తో అద్భుతం సృష్టించిన వ్యక్తి.. చూస్తే వావ్ అంటారు..

డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్( Christmas ) పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.ఈ పండుగ సందర్భంగా ఇళ్లను ఎంతో అందంగా అలంకరించుకున్నారు.

 A Man Who Created A Miracle With Plastic Bottles , Viral Video, Latest News, Tre-TeluguStop.com

ముఖ్యంగా అందమైన క్రిస్మస్ ట్రీ ఇంటికి తెచ్చుకొని సంబరాలు చేసుకున్నారు.ప్రపంచవ్యాప్తంగా అందమైన క్రిస్మస్ ట్రీకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.

అయితే ఒక వీడియో మాత్రం ప్రత్యేకంగా చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది.ఎందుకంటే ఇందులో ప్లాస్టిక్ బాటిల్స్ తో ఒక వ్యక్తి క్రిస్మస్ ట్రీ తయారు చేశాడు.

అది చూసేందుకు చాలా అద్భుతంగా కనిపించింది.

ఫిలిప్పీన్స్‌కు చెందిన ఈ వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒకటి ప్రత్యేకంగా రూపొందించాలని అనుకున్నాడు.అప్పుడే అతనికి ట్రెడిషనల్ క్రిస్మస్ ట్రీకి బదులుగా ఒక అసాధారణమైన ట్రీ చేద్దామని ఐడియా వచ్చింది.ఆ ఐడియా కోసం అతడు ప్లాస్టిక్ బాటిల్స్( Plastic bottles ) వాడుదాం అనుకున్నాడు.

దానిని ఆచరణలో పెట్టి చివరికి ప్లాస్టిక్ బాటిళ్లతో అట్రాక్టివ్ క్రిస్మస్ ట్రీ తయారు చేశాడు.ప్రముఖ ట్విట్టర్ పేజీ నౌ దిస్ (@nowthisnews) ఈ వీడియోను షేర్ చేసింది.

ఈ చెట్టును రూపొందించిన వ్యక్తి పేరు నెల్సన్ జాన్ సేస్ అని వెల్లడించింది.

ఈ క్రిస్మస్ ట్రీని ఓల్డ్ కోకాకోలా బాటిల్స్, ఓల్డ్ కారు టైర్, వైర్లను వాడి తయారు చేశారని తెలిపింది.ఈ చెట్టు ఏకంగా ఏడు అడుగుల ఎత్తు ఉంటుంది.అంటే ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.

ఈ పాత వస్తువులన్నిటినీ అతడు ఆకర్షిణీయంగా టై చేసి వాటి పైన ఒక స్టార్ సెట్ అప్ చేశాడు.లైట్లు ఆన్ చేస్తే ఈ ట్రీ అద్భుతంగా కనిపించి చాలామంది మనసులను దోచేసింది.

ఈ వీడియోకు పాతిక వేల దాకా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసి చాలామంది వాటి క్రియేటివిటీ అని నెల్సన్ జాన్‌ని పొగుడుతున్నారు.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube