వామ్మో! శానిటైజర్‌ను ఇలా కూడా వాడతారా?

కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అంతేకాదు, బయటకు వెళ్లినా.

 A Man Using Sanitizer Over All Body Video Goes Viral-TeluguStop.com

భౌతిక దూరం కూడా పాటిస్తున్నారు.ఎందుకంటే కొవిడ్‌ వైరస్‌తో పోరాటం చేయాలంటే ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి.

కానీ, ఏదైనా మితిమీరి చేస్తే అంతగా బాగుండదు.అలాంటిదే ఇక్కడ ఓ సంఘటన జరిగింది.

 A Man Using Sanitizer Over All Body Video Goes Viral-వామ్మో శానిటైజర్‌ను ఇలా కూడా వాడతారా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ పెద్దాయన చేసిన పని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.కరోనా వల్ల ప్రతి దుకాణాలు, బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల వద్ద ప్రవేశ ద్వారాల్లోనే హ్యాండ్‌ లేదా లñ గ్‌ శానిటైజర్లను అందుబాటులో పెడుతున్నారు.

అది కచ్చితమని ప్రభుత్వం ఆదేశించింది కూడా.సాధారణంగా మనం శానిటైజర్‌ను వాడితే కొన్ని డ్రాప్స్‌ చేతిలో వేసుకుని క్లీన్‌ చేసుకుంటాం.

మనం చెప్పుకోబోయే పెద్దాయన కూడా అదే పని చేశాడు.అదేంటీ? శానిటైజర్‌తో క్లీన్‌ చేసుకుంటే తప్పేముంది? అనుకోకండి.ఈయన ఏకంగా శానిటైజర్‌ను శరీరానికి నూనె పూసుకున్న మాదిరి చేతులు, కాళ్లు, తల మొత్తం రుద్దేసుకున్నాడు.

ఈ వీడియో సోషల్‌ మీడియాకు చిక్కింది.

ఇప్పటి వరకు దాదాపు 5 వేలకు పైగా వ్యూస్‌ దక్కాయి.దీనిపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

శానిటైజర్‌ను ఎలా వాడాలో ఈ పెద్దాయనను చూసి నేర్చుకుంటే కరోనా మన దరిదాపుల్లోకి రావాలన్నా జంకుతుందని కామెంట్లు పెడుతున్నారు.వీడియోను తీక్షణంగా చూస్తే ఓ పెద్దాయన బహిరంగ ప్రదేశంలో కూర్చుని ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడికి ఓ వ్యక్తి వచ్చి శానిటైజర్‌ను ఆ పెద్దాయన చేతిలో పోశాడు.ఆ శానిటైజర్‌ను వృద్ధుడు ముఖం, కాళ్లు, చేతులు, చివరికి జుట్టుపైన కూడా రుద్దుకున్నాడు.

అంతేకాదు, రెండోసారి కూడా శానిటైజర్‌ పోయించుకుని మళ్లీ అదేవిధంగా శానిటైజర్‌ను బాడీ మొత్తానికి పట్టించేశాడు.

ఈ వీడియోకు సంబంధించిన 50 సెకన్ల క్లిప్పింగ్‌ను ఐపీఎస్‌ అధికారి అయిన రూపిన్‌ శర్మ ట్వీటర్‌లో షేర్‌ చేశారు.ఇతడిని కొవిడ్‌ తాకాలనే ధైర్యం కూడా చేయదు కానీ, మాస్క్‌ కింద శానిటైజర్‌తో క్లీనింగ్‌ ఎందుకు? అని క్యాప్షన్‌ పెట్టారు.ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.

మరికొంత మంది నెటిజన్లు అంకుల్‌ శానిటైజర్‌తో మీరు స్నానం చేస్తే బాగుండేది‘ అని ఒకరు కామెంట్‌ పెట్టగా మీకు పూర్తి రక్షణ కవచంలా శానిటైజర్‌ పనిచేస్తోంది‘ అని మరొకరు పోస్ట్‌ చేశారు.కరోనా అతడి దగ్గరకు వెళ్లడానికి కూడా ధైర్యం చేయదు అని ఇంకొకరు స్పందించారు.

మరికొంత మంది అతని అమాయకత్వం చూసి నవ్వుకుంటున్నారు.ఇతడికి జాగ్రత్తగా ఎక్కువని ట్వీట్‌ చేయగా పాపం పెద్దాయనకు శానిటైజర్‌ ఎలా వాడాలో తెలియదనుకుంటా అని పోస్ట్‌ చేశారు.

#Covid 19 Virus #Sanitizer #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు