వైరల్: ఐఫోన్ బుక్ చేసిన బాలుడు.. కానీ పార్సెల్ ఓపెన్ చేసి చూస్తే..?!

ఆన్‏లైన్ షాపింగ్ సైట్లు ఏదైనా ఫెస్టివల్స్ ముందు, లేక స్పేషల్ డేస్ ముందు ఆఫర్స్ అందిస్తుంటారు.ఇక కరోనా మహామ్మారి పుణ్యమా ఆన్ లైన్ మార్కెట్ల పైగా తెగా ఆధారపడిపోతున్నారు చాలా మంది.

 A Man Ordered Iphone In Online But Got Coffee Table Instead , Viral Latest, Vir-TeluguStop.com

ఆఫర్స్‏ ఉంటే చాలు… అవసరం లేని వస్తువులను కూడా కొనిపడేస్తుంటారు.ఇక ఈ షాపింగ్ సైట్లలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ పై అనేక రకాల ఆఫర్స్ అందుబాటులో ఉంటాయన్న సంగతి తెలిసిందే.

షాపులో దొరికే ధరల కంటే ఆన్ లైన్ సైట్లలో స్మార్ట్ ఫోన్స్ విలువ కాస్తా తక్కువే.అయితే కొన్ని సందర్బాల్లో స్మార్ట్ ఫోన్స్ బుక్ చేసిన వారికి మొబైల్స్ కాకుండా వేరే వస్తువులు వచ్చిన సంఘటనలు బోలెడన్నీ.

తాజాగా ఓ యువకుడికి కూడా అలాంటి షాకే తగిలింది.ఓ ఆన్ లైన్ సైట్‏లో తక్కువ ధరకే ఐఫోన్ ఉండడంతో.

వెంటనే బుక్ చేసేసాడు.తీరా ఇంటికి వచ్చిన ఆ పార్షిల్ చూసి ఖంగుతిన్నాడు.

ఇంతకీ ఎం జరిగిందో తెలుసుకుందామా.

థాయ్‏ల్యాండ్‏లో ఉండే ఓ యువకుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‏గా ఉండేవాడు.

అయితే ఓక రోజు ఆన్ లైన్స్ సైట్లలో ఉన్న ఆఫర్స్ చూస్తున్న అతనికి లజాడా అనే ఓ ఈ కామర్స్ సైట్‏లో తక్కువ ధరకే ఐఫోన్ కనిపించింది.ఇంకేముంది మరో ఆలోచన లేకుండా.

దానిని బుక్ చేసేశాడు.అందుకు కావాల్సిన అమౌంట్ మొత్తం కట్టాడు.

ఆ తర్వాత కొద్ది రోజులకు అతని ఇంటికి ఓ పార్శిల్ వచ్చింది.అయితే పార్షిల్ చూడగానే అతనికి దిమ్మతిరిగిపోయింది.

ఎందుకంటే స్మార్ట్ ఫోన్‏కు రావాల్సిన బాక్స్ కంటే పెద్ద బాక్స్ అతని ముందు ఉంది.వెంటనే అసలు లోపల ఏముందో చూద్దాం అని దానిని తెరిచిన యువకుడికి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.

అందులో స్మార్ట్ ఫోన్‏కు బదులుగా ఐఫోన్ షేప్‏‏లో ఉన్న ఓ భారీ కాఫీ టేబుల్ ఉంది.ఇందుకు సంబంధించిన ఫోటోలను అతడు ఆన్‏లైన్‏లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube