ప్రపంచంలోనే అత్యంత వింత పెళ్ళి ఇది  

A Man From Us Married His Smartphone -

ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్ళి చేసుకుంటే అది సాధారణం, అబ్బాయిని అబ్బాయి, అమ్మాయిని అమ్మాయి పెళ్ళి చేసుకుంటే అది స్వలింగ సంపర్కం, ఒక మనిషి జంతువునో, చెట్టునో పెళ్ళి చేసుకుంటే, అది మూఢనమ్మకం.మరి ఓ మనిషి స్మార్ట్ ఫోన్ ని పెళ్ళి చేసుకుంటే దాన్ని ఏమనాలో !

మనిషి స్మార్ట్ ఫోన్ కి ఎంతలా అలవాటుపడిపోయాడో చెప్పడానికి ఒక చిన్న ఉదాహారణ లాంటి సంఘటన లాస్ వెగాస్ లో జరిగింది.

A Man From US Married His Smartphone-General-Telugu-Telugu Tollywood Photo Image

అరోన్ చెర్వెనాక్ అనే పురుషుడు, 365 కిలోమీటర్ల ప్రయాణించి లాస్ వెగాస్ లో తన స్మార్ట్ ఫోన్ ని పరిణయమాడాడు.నమ్మడానికి కష్టంగా ఉన్నా, ఈ వింత నిజంగానే జరిగింది.

తన ఫోన్ ని ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటానని, సురక్షితంగా ఉంచుతానని ప్రమాణం కూడా చేసాడు వరుడు.ఫోన్ కేస్ కి ఓ ఉంగరం కూడా తగిలేయడం మరో విశేషం.

“నా స్మార్ట్ ఫోన్ తో చాలాకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నాను.మనం మన ఫోన్లతో ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంటాం.

వాటి వలన రిలీఫ్ దొరుకుతుంది.టైమ్ గడుస్తుంది.

నా వరకైతే ఓ బంధం అంటే ఇలానే ఉండాలి” అంటూ చెప్పుకొచ్చాడు అరోన్.

ఇలాంటి వింతలు మళ్ళీ జరిగినా జరగొచ్చు.

టెక్నాలజీ మనుషుల్ని అంతలా మార్చేసి బానిసలుగా తయారుచేస్తోంది.ఏమో .వండిపెట్టే స్మార్ట్ ఫోన్లు కూడా వస్తే చాలామంది ఇలానే స్మార్ట్ ఫోన్నే పెళ్ళి చేసుకుంటారేమో!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Man From Us Married His Smartphone- Related....