పళ్లు తోముకుంటూ బ్రష్‌ మింగేశాడు, పరువు పోతుందని చెప్పలేదు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే పాపం అంటూ నవ్వు ఆపుకోలేరు

పళ్లు తోముకునే బ్రష్‌ గొంతుకు గుచ్చుకోవడం సర్వ సాదారణంగా మంనం చూస్తూ ఉంటాం.ఏమరపాటుగా బ్రష్‌ చేస్తున్నప్పుడు పొరపాటున చిగుర్లకు బ్రస్‌ గుచ్చుకోవడం లేదంటే గొంతుకు గుచ్చుకోవడం జరుగుతుంది.

 A Man Accidentally Swallowed Toothbrush In Delhi 2-TeluguStop.com

కాని బ్రష్‌ మొత్తం గొంతులోకి వెళ్లి పోవడం, ఆ తర్వాత మింగడం అనేది జరగదు.

కాని దేశ రాజధాని దిల్లీలో ఆ సంఘటన జరిగింది.అత్యంత విచిత్రంగా జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం చర్చలనీయాంశం అవుతుంది.ఆ వ్యక్తి బ్రష్‌ మింగి పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ఎవరికి చెప్పక పోవడం మరింతగా ప్రమాదం అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే… దిల్లీ సీమపురికి చెందిన 36 ఏళ్ల ఒక వ్యక్తి బ్రష్‌ తో పళ్లను శుభ్రం చేసుకున్నాడు.ఆ తర్వాత గొంతును కూడా శుభ్రం చేసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో గొంతులో బ్రష్‌ ఇరుక్కు పోయింది.దాంతో అతడు బ్రష్‌ను లాగేందుకు ప్రయత్నించగా, ఆ బ్రష్‌ మరింతగా జారి లోనికి వెళ్లి పోయింది.

బ్రష్‌ కడుపులోకి వెళ్లడంతో ఆ వ్యక్తి పరువు పోతుందని భావించి ఎవరికి చెప్పలేదు.ఆ బ్రష్‌ మల ద్వారం ద్వారా అదే వస్తుంది లేని అని భావించాడు.కాని అది కాస్త తర్వాత రోజున తీవ్రమైన కడుపు నొప్పిగా మారింది.

తీవ్ర కడుపు నొప్పి రావడంతో గురు త్యాగ్‌ బహదూర్‌ హాస్పిటల్‌ లో జాయిన్‌ అయ్యాడు.కడుపు నొప్పి విపరీతంగా వస్తుందంటూ ఆ వ్యక్తి హాస్పిటల్‌ లో జాయిన్‌ అవ్వడంతో ఎక్స్‌రే మరియు స్కానింగ్‌ చేశారు.కడుపులో ఏదో ఉందని వైధ్యులు గుర్తించారు.

అప్పుడు తాను బ్రష్‌ను మింగినట్లుగా చెప్పాడు.అవాక్కయిన డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా ఆ బ్రష్‌ను తొలగించారు.పెద్దగా ఇబ్బంది లేకుండా ఆ వ్యక్తి పొట్టకు కింది బాగంలో చిన్న రంద్రం పెట్టి ఆ బ్రష్‌ను తొలగించినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.

అంత పెద్ద బ్రష్‌ గొంతులోకి ఎలా వెళ్లిందో డాక్టర్లు కూడా తెలియక నోరెళ్లబెడుతున్నారు.మీరు ఎలా పోతుందా అని ట్రై చేసేరు, మీకు కడుపు నొప్పి, ఎండోస్కోపి అవసరం అయ్యేను…!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube