ఎంబీఏ చదివి ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.. ఎందుకో తెలుసా.. ?

నిజమైన ప్రేమకు కృరమృగాలు సైతం కృరత్వాన్ని వదిలిన సంఘటనలు ఎన్నో లోకంలో అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.అలాంటిది అన్ని ఆలోచించగలిగే నేర్పరితనం ఉన్న మనుషులు మాత్రం స్వార్ధంతో కన్నవారి పాలిట శాపంగా మారుతున్నారు నేటి కాలంలో.

 A Madhukishan Of Vizag Who Studied Mba Joined As Sanitation Worker In Hospital For His Father-TeluguStop.com

కానీ ఓ యువకుడు మాత్రం కన్న తండ్రి కోసం ఎంబీఏ చదివి ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.ఎందుకనే వివరాలు తెలుసుకుంటే.

ఏపీలోని విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలేనికి చెందిన ఎ.మధుకిషన్‌ అనే యువకుడు ఎంబీఏ చదివి మంచి ఉద్యోగంలో ఉన్నాడు.కానీ ఇతని తండ్రి కరోనా కారణంగా అనారోగ్యం పాలవగా చికిత్స కోసం విశాఖలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రి కేజీహెచ్‌లో చేర్పించారు.అయితే అక్కడ స్నానం చేస్తు పడిపోయిన ఇతని తండ్రిని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఆ విషయం తెలిసిన మధుకిషన్‌ తన తండ్రి ఆరోగ్యం కుదుటపడే వరకు తానే స్వయంగా సేవలు అందించాలని భావించి ఆ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.

 A Madhukishan Of Vizag Who Studied Mba Joined As Sanitation Worker In Hospital For His Father-ఎంబీఏ చదివి ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుడిగా చేరాడు.. ఎందుకో తెలుసా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మధుకిషన్‌ డ్యూటీలో చేరే సమయానికంటే ముందే ఇతని తండ్రి చనిపోయాడని తెలిసింది.కాగా తన తండ్రి మరణానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసాడట.

ఇకపోతే తల్లిదండ్రులంటే శత్రువుల్లా భావిస్తున్న ఈ రోజుల్లో తన తండ్రి కోసం ఈ వ్యక్తి చేసిన త్యాగం కళ్లుమూసుకుపోయిన కొడుకులకు కనువిప్పు కలిగించాలని ఆశిద్దాం.

#Madhukishan‌ #To Serve Father #FatherCorona #Akkayyapalam #Visakhapatnam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు