తల్లి అస్తిపంజరంతో నివసిస్తున్న మహిళ.. చివరికి?  

సాధారణంగా వ్యక్తి చనిపోతే ఒక రోజు వ్యవధిలోనే శరీరం దుర్వాసన రావడం మొదలవుతుంది.ఇలాంటి నేపథ్యంలోనే ఓ మహిళ తన తల్లి అస్తిపంజరాన్ని మంచం కింద దాచుకుని జీవిస్తున్న ఘటన ఆదివారం మహారాష్ట్ర ముంబైలో వెలుగుచూసింది.

TeluguStop.com - A Mad Woman Living With Her Mother Skeleton In Mombai

పోలీసులు తెలిపిన వివరాల మేరకు….

ముంబై ప్రాంత సమీపంలోని చూయిమ్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ తన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల రోడ్డుపై చెత్త, ఇతర వ్యర్థ పదార్థాలను పోస్తూ ఉండేది.

TeluguStop.com - తల్లి అస్తిపంజరంతో నివసిస్తున్న మహిళ.. చివరికి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ విషయం పై గ్రామస్తులు తనకు ఎన్ని సార్లు చెప్పిన మతిస్థిమితం లేని కారణంగా పలుమార్లు అదే పునరావృతం చేస్తూ ఉండేది.ఈమె చేష్టలకు విసిగిపోయిన గ్రామస్తులు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు.అయితే తన ఇంట్లో మంచం పై కూర్చున్న ఆమె దగ్గరకు పోలీసులు వెళ్లారు.

అదే సమయంలో మంచం కింద ఓ వ్యక్తి శరీరం దుప్పటితో కప్పినట్లుగా ఉండటాన్ని గమనించిన పోలీసులు దుప్పటిని లాగి చూశారు.అయితే పోలీసులకు ఊహించని సంఘటన ఎదురయ్యింది.

మంచం కింద ఓ అస్తిపంజరం ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.అయితే ఆ ఆస్తి పంజరం మతిస్థిమితం కోల్పోయిన సదరు మహిళ తల్లి అయిన ఇవాన్‌ ఫెర్నాండజ్‌కు చెందినదిగా పోలీసులు విచారణలో తెలిపారు.

అయితే తన తల్లి ఎలా మరణించింది అన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు అస్తిపంజరాన్ని పోస్ట్ మార్ట్ నిమిత్తం తరలించారు.

ప్రస్తుతం పోస్ట్ మార్ట్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు.ఈ రిపోర్ట్ ను బట్టి ఆమె మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.

#AMad #MotherBody #WomenLiving #MotherSkeleton

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

A Mad Woman Living With Her Mother Skeleton In Mombai Related Telugu News,Photos/Pics,Images..