మన స్టార్స్‌ లో చాలా మందికి హైదరాబాద్‌లో ఓటు లేదా?

టాలీవుడ్‌ కు చెందిన వారు దాదాపు 40 నుండి 45 వేల మంది వరకు హైదరాబాద్‌లో ఉంటారు అనే టాక్‌ ఉంది.అందులో కనీసం పాతిక వేల మందికి అయినా ఇక్కడ ఓటు హక్కు ఉండి ఉంటుంది.

 A Lot Of Tollywood Celebrities Has No Vote In Ghmc , Tollywood Celebrities , Ghm-TeluguStop.com

అందులో సెలబ్రెటీలు ఎంత మంది ఉంటారు అనేది మీరే ఒక అంచనాకు రావచ్చు.తక్కువలో తక్కువ 500 మంది అయినా ప్రముఖులు ఓటు హక్కును కలిగి ఉంటారు.

కాని వారిలో ఎంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వచ్చారు.చాలా మంది ఓటు విషయంలో అస్సలు ఆసక్తి చూపించినట్లుగా అనిపించలేదు.

చిరంజీవి.నాగార్జున.

విజయ్‌ దేవరకొండ మరి కొందరు తప్ప చాలా మంది ఓటుకు చాలా దూరంగా ఉన్నారు.

కొందరు షూటింగ్‌ ల పేరు చెప్పి దూరంగా ఉంటే మరి కొందరు కరోనా పేరుతో దూరంగా ఉన్నారు.

ఈ సమయంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.చాలా రిస్క్‌ అయిన షూటింగ్‌ ల్లో పాల్గొంటున్న వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నిర్వహిస్తున్న ఓటింగ్‌ లో ఎందుకు పాల్గొనలేదు అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో సినీ ప్రముఖులు వ్యవహరించిన తీరు ఏమాత్రం సరిగా లేదు.హైదరాబాద్‌ లోని యువత ఎంత బద్ద కస్తులు అనే విషయం ఈ ఎన్నికలతో మరోసారి నిరూపితం అయ్యింది.

అత్యంద దారుణమైన పోలింగ్‌ పర్సంటేజ్‌ నమోదు అవ్వడం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేస్తున్నారు.సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో అలా ఇలా అని చెప్పడం కాదు ఈ సమయంలో ప్రతి ఒక్కరు వెళ్లి ఓటు వేయాలని అంటున్నారు.

ఓటు హక్కును వినియోగించుకోని వాడు బతికి లేనట్లు లెక్క అన్నట్లుగా పల్లెటూరులో అంటూ ఉంటారు.మరి ఆ విషయాన్ని హైదరాబాద్‌ వాసులు ఎందుకు గుర్తించలేదో వారికే తెలియాలి.

సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా షూటింగ్‌ కోసం కాకుండా ఓటు కోసం టైం కేటాయిస్తే బాగుండేది.ఇంత మంది స్టార్స్‌ ఉంటే వారిలో ఓటు ఉన్నది కొందరికేనా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube