అందరి ముందు అనసూయను ఆంటీ అనేసిన బుడ్డోడు... బాగా హర్ట్ అయిన అనసూయ?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూనే వెండితెరపై ఎన్నో సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వెండి తెరపై బుల్లితెరపై బిజీగా గడుపుతూ ఉన్న అనసూయ తాజాగా స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి సుధీర్ తో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

 Little Boy Calls Anasuya Aunty In Super Singer Juniors Show Details, Anasuya, To-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మనో, చిత్ర, ఉషా ఉత్తుప్, హేమ చంద్ర, రెనీనా రెడ్డి వంటి వారు కూడా కనిపించబోతోన్నారు.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఈ ప్రోమోలో భాగంగా చిన్న పిల్లలు అనసూయని ఓ ఆటాడుకున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసిన ఓ బుడ్డోడు అనసూయని ఏకంగా అందరి ముందు ఆంటీ అంటూ తనని బాగా హర్ట్ చేశారు.

ఇలా ఈ బుడ్డోడు అనసూయను ఆంటీ అనడంతో ఒక్కసారిగా మన యాంకరమ్మ తెల్లమొహం వేసుకుంది.

ఇకపోతే ఆ బుడ్డోడు రామ్మా చిలకమ్మా అంటూ చిరంజీవి పాటను పాడారు.

నువ్వు ఎవరి టీం లోకి వెళ్తావు అని ప్రశ్నించగా వేదికపై ఎవరు బాగా డ్యాన్స్ చేస్తే వాళ్ళ టీమ్ లోకి వెళ్తానని చెప్పారు.ఇలా అనసూయ డాన్స్ చేయడంతో మరోసారి ఆ బుడ్డోడు డాన్స్ చేయమంటే ఈ కోతి గంతులు ఏంటి అంటూ అనసూయ పరువు మొత్తం తీసేసాడు.మొత్తానికి ఈ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube