వీధుల్లో ఎంచక్కా షికారు చేస్తున్న సింహం.. షాకింగ్ వీడియో వైరల్..

అడవికి సమీపాన ఉన్న ప్రాంతాల్లోకి పులులు, చిరుతలు, సింహాలు, ఎలుగుబంట్ల వంటి క్రూర మృగాలు అప్పుడప్పుడు వస్తుంటాయి.ఇలాంటి ప్రాంతంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.

 A Lion Strolling In The Streets Shocking Video Viral , Viral Video, Latest News-TeluguStop.com

దగ్గరగా అడవులు లేని సిటీల్లో మాత్రం వీటి బెడద ఉండే ఛాన్స్ తక్కువ.అందువల్ల అక్కడ పెద్దగా భయం లేకుండా ఉంటారు.

అయితే కొన్నిసార్లు ఈ ప్రాంతాల్లో కూడా క్రూర మృగాలను ఫేస్ చేయాల్సి రావచ్చు.ఒకేసారి అమాంతం మింగేయగల ఓ పెద్ద సింహం ( lion )మనం నడుస్తున్న వీధుల్లోనే ప్రత్యక్షం కావచ్చు.

అలాంటి పరిస్థితిని ఊహించుకుంటేనే భయమేస్తుంది కదూ.అయితే ఇటలీలో నిజంగానే ఒక పెద్ద సింహం సిటీ వీధుల్లోకి వచ్చింది.అది చాలా ప్రశాంతంగా వీధుల్లో షికారు చేస్తూ కెమెరాలకు చిక్కింది.ఈ సింహం నవంబర్ 11వ తేదీన స్థానిక సర్కస్ నుంచి తప్పించుకుంది.తర్వాత ఇటలీలోని లాడిస్పోలి( Ladispoli ) పట్టణ వీధుల్లో తిరుగుతూ కనిపించింది.అదృష్టం కొద్దీ సింహం సర్కస్ నుంచి తప్పించుకున్న వెంటనే అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ఎవరూ తమ ఇళ్ళ నుంచి బయటికి రావద్దని హెచ్చరించారు.దాంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్ళలోనే ఉండిపోయారు.

ఆ సమయంలో సింహం జనావాసాల్లోకి వచ్చి తిరుగుతున్నట్టు ప్రజలు తమ ఇళ్లలోపల నుంచి గమనించారు.అనంతరం అధికారులకు సమాచారం అందించగా వారు వెంటనే అక్కడికి చేరుకొని ఒక మత్తుమందును సింహానికి ఇంజక్ట్ చేశారు.ఆపై దాన్ని పట్టుకెళ్ళారు.

<img src="https://telugusto

లాడిస్పోలీ వీధుల్లో సింహం షికారు చేస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియా( Social media )లో ప్రత్యక్షమయ్యాయి.ఒక వీడియోలో సింహం వీధుల్లో తిరుగుతున్నట్లు కనిపించింది.మరో వీడియోలో మత్తుమందు ఇచ్చి కొందరు అధికారులు దానిని వలవేసి బయటికి తీసుకొచ్చినట్లు కనిపించింది.

చివరికి దాన్ని సర్కస్ కి పంపించారు.సర్కస్ అంటేనే జంతువులకు ఒక నరకం లాంటిది.

అక్కడ శిక్షకులు చాలా క్రూరమైన పద్ధతుల్లో వాటికి ట్రైనింగ్ ఇస్తారు.తప్పుగా అవి పర్ఫార్మ్ చేస్తే చాలా దారుణంగా హింసిస్తారు.

వాటిని అడవిలో వాటంతట అవి స్వేచ్ఛగా బతికేలా వారు అనుమతించరు.చాలా చిన్న ఇనుప పంజరాలలో వాటిని బంధించి చాలా దూరం రవాణా చేస్తుంటారు.

వీటివల్ల ఆ జంతువుల జీవితం నరకం అవుతుంది.వాటి బాధలు అర్థం చేసుకొని కొన్ని ప్రభుత్వాలు సర్కస్‌లో వైల్డ్ యానిమల్స్ ఎవరూ ఉపయోగించకుండా నిషేధాలు విధించాయి.

ఇంకా మిగతా ప్రభుత్వాలు కూడా వీటిపై బ్యాన్‌ విధిస్తే జీవహింస తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube