జగన్ కు వైసీపీ మాజీల ఘాటు లేఖ ! మరీ ఇంత ఘాటుగానా...?  

  • రాజకీయ పార్టీలు అన్నాక విమర్శలు … ప్రతి విమర్శలు ఉండడం కామన్. ఒకరిని తక్కువ చేయడానికి మరొకరు హాట్ హాట్ గా ఘాటు పంచ్ లు వేస్తూ… రాజకీయం వేడెక్కిస్తుంటారు. ఈ విధంగా వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు గుప్పించడానికి బాబు వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన నాయకులనే అస్థ్రాలుగా మార్చి జగన్ మీదకు వదిలారు.

  • A Letter To YS Jagan From YCP Ex Leaders-Chandrababu Naidu Dadi Veerabhadra Rao Janasena Party Jyothula Nehru Tdp Ycp Leaders Ys

    A Letter To YS Jagan From YCP Ex Leaders

  • ఇక బాబు ఆదేశాలతో వారు జగన్ మీద సంచలన ఆరోపణలు చేస్తూ… లేఖ కూడా విడుదల చేశారు. జగన్ పాదయాత్ర ముగించుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మీద అనేక ఆరోపణలు చేస్తూ ఆ పార్టీ మాజీలు లేఖ విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ లేఖలో ఏముంది అంటే…?

  • A Letter To YS Jagan From YCP Ex Leaders-Chandrababu Naidu Dadi Veerabhadra Rao Janasena Party Jyothula Nehru Tdp Ycp Leaders Ys
  • సైకో మనస్థత్వంతో కనీస మానవత్వం లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని చెబుతూ. ఇలాంటి ఘటనలన్నింటినీ లేఖలో వివరించారు. జగన్‌ సీఎం కుర్చీ కోసం మానసిక వ్యాధితో బాధపడుతున్నారని వారు లేఖలో మండిపడ్డారు.జగన్ ఓ అవినీతి చక్రవర్తి అని అభివృద్ది చక్రవర్తి చంద్రబాబు అని అందులో పేర్కొన్నారు. రూ.43వేల కోట్ల అవినీతి కేసులో జగన్‌ ఏ-1 ముద్దాయిగా ఉన్నారని, జగన్‌ దుష్ట రాజకీయాలు భరించలేకే తాము వైసీపీ నుంచి బయటకు వచ్చినట్లు ప్రకటించారు. బెయిల్‌ కోసం సోనియాగాంధీకి, తెలంగాణలో కాంట్రాక్టుల కోసం కేసీఆర్‌కు, కేసుల మాఫీ కోసం మోదీకి వైఎస్‌ జగన్‌ అమ్ముడుపోయారని ఆరోపించారు. జగన్‌ అవినీతి వల్ల ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి జైలుపాలయ్యారని మంత్రులు విమర్శించారు. నలుగురు సభ్యులు ఉండే జగన్‌ కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎందుకని ప్రశ్నించారు.

  • అసెంబ్లీకి రాకుండా రూ.లక్షల జీతాలు తీసుకోవడం ప్రజా ద్రోహం కాదా? పాదయాత్రలో ఒక్కసారైనా ప్రధాని మోదీని విమర్శించారా? అని మంత్రులు, ఎమ్మెల్యేలు లేఖ ద్వారా జగన్ ను నిలదీశారు. అంతే కాకుండా… జగన్‌ ఓ సైకో అని. ఆయన ఓ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని 12 చార్జిషీట్లలో ఏ-1 ముద్దాయిగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.

  • A Letter To YS Jagan From YCP Ex Leaders-Chandrababu Naidu Dadi Veerabhadra Rao Janasena Party Jyothula Nehru Tdp Ycp Leaders Ys
  • పాదయాత్రలో ఒక్కసారైనా మోదీ చేసిన ద్రోహంపై మాట్లాడలేదని పాదయాత్రలో ఎన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధి నిరోధకుడు జగన్‌ అని మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శించారు. అంతే కాదు సాక్షి పత్రిక కోసం షర్మిలను ఇంటర్యూ చేసిన జర్నలిస్ట్ ను జగన్ ఉద్యోగం నుంచి తీసేశారని, సీనియర్ లీడర్ జ్యోతుల నెహ్రూను. జగన్ తన పక్కన కూర్చోవద్దని ఆదేశించినట్టు ? అలాగే టీడీపీ సీనియర్ లీడర్ గా ఉంటూ… వైసీపీ లో చేరిన దాడి వీరభద్రరావు కూడా సార్ అని పిలిస్తేనే పార్టీలో ఉండమన్నారు అంటూ… ఇలా అనేక విమర్శలు చేశారు.