కొడుకుని స్కూల్ లో చేరుస్తు అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ ఇది.! తల్లితండ్రులు, టీచర్లు తప్పక చదవాల్సిన లేఖ.!  

A Letter From Abraham Lincoln To His Son\'s Teacher-

A letter written to American Lincoln's teacher, one of the American president, has included his son at school. This is the letter to every mother, father, teacher, student.

Mrs. Sampantha Sundarayar, a prominent translator, has given us the translation of the letter into Telugu.

"Our boy is coming to school for the first time. He is going to be strange and new for some time .. I hope you'll be a little smoother with him.

This adventure can help him go beyond the saphasamudras .. wars, tragedies and murders in those adventures.

In such a life, there is a need for belief, love and courage. .

So please, do you teach everything you need to learn and love? Can you teach them delicately if possible? Teach an enemy to be an enemy.

Tell him that not all men are righteous and everyone is truthful .. Say that there is a hero in the place where there is a wicked man and a devoted leader who is a devoted political leader.

Teach them to get 10 cents worth more than one dollar found.

Feel good when you lose it, to be self-pleasing when winning .. Teach .. .

Teach everyone to be polite and harsh. Be good if you can keep him away from jealousy. Teach me laughing without a laughing ..

 • తన కుమారుణ్ణి స్కూల్లో చేర్చుతూ ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖఇది ప్రతి తల్లికి, తండ్రికి, టీచర్ కు, విద్యార్ధికి చేరాల్సిన లేఖ.

 • కొడుకుని స్కూల్ లో చేరుస్తు అబ్రహాం లింకన్ టీచర్ కి రాసిన లేఖ ఇది.! తల్లితండ్రులు, టీచర్లు తప్పక చదవాల్సిన లేఖ.!-A Letter From Abraham Lincoln To His Son's Teacher

 • ప్రముఖ అనువాదకురాలు శ్రీమతి శాంత సుందరిగారు లేఖను తెలుగులోకి అనువదించి మనకు అందించారు.

  ” మా అబ్బాయి ఇవాళే మొదటిసారి స్కూలుకి వస్తున్నాడు.కొంతకాలం అక్కడ అంతా వాడికి వింతగానూ కొత్తగానూ ఉండబోతోంది.

 • అందుకే వాడితో మీరు కొంచెం సున్నితంగా ప్రవర్తిస్తారని ఆశిస్తున్నాను. ఈ సాహసకృత్యం వాణ్ణి సప్తసముద్రాలూ దాటి వెళ్ళేందుకు సాయపడవచ్చు.

 • ఆ సాహసాల్లో యుద్ధాలూ, విషాదాలూ, దుఃఖాలూ వాడికి అనుభవంలోకిరావచ్చు.అలాంటి జీవితంలో వాడికి నమ్మకం, ప్రేమ, ధైర్యం తోడుగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 • A Letter From Abraham Lincoln To His Son's Teacher-

  అందుచేత, దయచేసి మీరు దగ్గరుండి ప్రేమతో వాడు నేర్చుకోవలసినవన్నీ నేర్పిస్తారా? వీలైతే అవన్నీ సున్నితంగా నేర్పగలరా?

  ఒక మిత్రుడుంటే ఒక శత్రువు కూడా ఉంటాడని నేర్పండి.అందరు మనుషులూ న్యాయంగా ఉండరనీ, అందరూ సత్యసంధులు కారనీ వాడికి తెలియాలి.ఒక దుష్టుడున్న చోట ఒక వీరుడు కూడా ఉంటాడనీ , జిత్తులమారి రాజకీయ నేత ఉండే చోటే అంకితభావంతో పనిచేసే నేత కూడా ఉంటాడనీ చెప్పండి.

 • అప్పనంగా దొరికిన ఒక డాలరు కన్నా సొంతంగా సంపాదించుకున్న పది సెంట్లు ఎక్కువ విలువైనవని నేర్పండి.స్కూల్లో మోసం చేసి గెలవటం కన్నా ఫెయిలవటం ఎక్కువ గౌరవంగా ఉంటుందని నేర్పండి.

 • ఓడిపోయినప్పుడు చక్కగా దాన్ని అంగీకరించటం, గెలిచినప్పుడు మనస్ఫూర్తిగా ఆనందించటం,. నేర్పండి.

 • A Letter From Abraham Lincoln To His Son's Teacher-

  అందరితో మృదువుగా ప్రవర్తించమనీ, కఠినంగా ఉన్న వాళ్ళతో కఠినంగా ఉండమనీ నేర్పండి.

  అసూయకు వాణ్ణి దూరంగా ఉంచగలిగితే బావుంటుంది. చప్పుడు చెయ్యకుండా నవ్వటం నేర్పండి.

 • వాడు విచారంగా ఉన్నప్పుడు నవ్వటం నేర్పగలిగితే నేర్పండి.కన్నీళ్ళు కార్చటం అవమానమేమీ కాదని నేర్పండి.

 • ఓటమిలో కూడా కీర్తి ప్రతిష్ఠలు ఉండవచ్చనీ, గెలుపులో నిరాశ ఉండవచ్చనీ నేర్పండి.

  పుస్తకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో నేర్పండి.

 • అందరూ వాడి ఆలోచనలు తప్పని అన్నప్పటికీ, వాటిని తను మట్టుకు గౌరవించటం నేర్పండి.అందరూ దేన్నో అనుసరిస్తున్నా, తను అలా చెయ్యకుండా ఉండే మనోబలాన్ని మా అబ్బాయికి నేర్పండి.

 • అందరు చెప్పేదీ వినమనీ, సత్యమనే జల్లెడతో వడబోసి మంచిని మాత్రమే గ్రహించమనీ చెప్పండి.

  తన ప్రతిభనీ, మేధస్సునీ ఎక్కువ ధర చెల్లించేవారికే అమ్మమని చెప్పండి కానీ తన హృదయానికీ, ఆత్మకీ వెల నిర్ణయించద్దని నేర్పించండి.

 • అసహనం ప్రదర్శించే ధైర్యాన్నీ, ధైర్యంగా ఉండేందుకు ఓర్పునీ కలిగి ఉండనివ్వండి.

  ఉదాత్తమైన ఆత్మవిశ్వాసం ఉండాలనీ,అప్పుడే మానవాళి మీదా దేవుడిమీదా వాడికి ఉదాత్తమైన విశ్వాసం ఏర్పడగలదనీ నేర్పించండి.

 • మీకు వీలైనంత వరకూ ప్రయత్నించి వాడిని మంచి పిల్లవాడుగా మలచండి.మీరు మలచ గలరు.

 • ఇది మా నమ్మకం.