జింక‌ను వేటాడబోయి ప్రాణాల‌మీద‌కు తెచ్చుకున్న చిరుత‌..

సోష‌ల్ మీడియాలో మ‌న‌కు నిత్యం క‌నువిందు చేసే వాటిల్లో ఎక్కువ‌గా జంతువుల‌కు సంబంధించిన వీడియోలు అలాగే ఫొటోలు ఉంటాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.ఎందుకంటే ప్ర‌తి ఒక్క‌రికీ కూడా జంతువుల‌కు సంబంధించిన విష‌యాలు తెలుసుకోవాల‌న్నా లేదంటే వాటి విన్యాసాలు చూడాల‌న్నా కూడా య‌మ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

 A Leopard That Came Alive After Hunting A Deer, Leopard, Deer, Indian Forest Ser-TeluguStop.com

ఇక‌పోతే అడ‌విలో క్రూర మృగాల‌కు సంంధించిన వేట‌ల‌కు అయితే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే.చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద‌వారి దాకా వీటిని ఎంతో ఇష్ట‌ప‌డి చూస్తుంటారు.

ఎందుకంటే క్రూర మృగాల వేట ఊహ‌కు కూడా అంద‌నంత దారుణంగా ఉంటుంది.ఈ జంతువులు త‌మ ఎర‌ను గ‌న‌క టార్గెట్ చేస్తే మాత్రం ఎలాగైనా సరే వాటిని చంపి తినేదాకా వెంట‌బ‌డతాయి.

అయితే ఇప్పుడు కూడా నెట్టింట ఓ వీడియో భ‌యం పుట్టించేలా ఉంది.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అయిన‌టువంటి సుధా రామెన్ ఈ భ‌యంక‌ర‌మైన వీడియోను పోస్టు చేయ‌డంతో అది కాస్త వైర‌ల్ అయిపోయింది.

కాగా ఈ వీడియో ఓ చిరుత పులికి సంబంధించింది.ఇందులో మంచు చిరుత చాక‌చ‌క్యంగా జింకను ప‌ట్టుకోవ‌డానికి సంబంధించింది.

అయితే ఇందులో ఆ మంచుకొండ‌ల్లో చిరుత తన ఎరను పట్టుకోవటానికి ఎంత సాహాసం చేసిందో చూస్తే ఒరా అనాల్సిందే.జింక కూడా ఎలాగైనా చిరుత నుంచి త‌ప్పించుకోవాల‌ని పరిగెత్తుతూ కొండ చివరకు వెళ్లి ఆగుతున్న‌ట్టు క‌నిపిస్తుంది.కాగా చిరుత వేగాన్ని ఆపుకోలేక చివ‌ర‌కు జింకను తోసుకుంటూ ఆ కొండమీదనుంచి కింద పడిపోవ‌డం మ‌నం చూడొచ్చు.అయితే అలా కింద ప‌డుతున్న స‌మ‌యంలో కూడా చిరుత జింకను త‌న నోటితో పట్టుకొనే ఉండ‌టం విశేషం.

ఇక కింద ప‌డ్డ త‌ర్వాత కూడా జింక‌ను వ‌ద‌ల‌కుండా ప‌ట్టుకునే ఉంది.ఇక దీన్ని చూసిన వారంతా కూడా దాని ప‌ట్టుద‌ల‌ను చూసి కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube