వైరల్ వీడియో: రోడ్డుపై ఉన్న వ్యక్తులతో ఆడుకున్న చిరుత..!

ఎప్పుడైనా సరే మనం పులి పేరు వినగానే భయభ్రాంతులకు లోనవుతాము.అలాంటిది మన ముందర పులి ఉందంటే మనకు గుండెజారి పోయినంత పని అవుతుంది.

 A Leopard Playing With A Guy, Viral Video, Social Media, Chirutha, Tiger, Ifs-TeluguStop.com

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పులి సంచారాలు జరుగుతున్నట్లు ఎన్నో వార్తలు మనం వింటూనే ఉన్నాం.అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనాలు నివసిస్తున్న ప్రాంతం లోకి వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు మనం ఈ మధ్య కాలంలో చాలానే చూశాం.

వన్య మృగాలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతం లోకి చేరుకొని ఎంతో మందిని బలి తీసుకుంటున్న సంఘటనలు ఈ మధ్య అనేకం జరిగాయి.ఇలా పరిస్థితులు ఉన్న సమయంలో తాజాగా జరిగిన ఓ సంఘటన అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన ప్రతిచోట పునరావృతమయ్యే సంఘటనకు కాస్త విరుద్ధంగా జరిగింది.

ఎక్కడైనా సరే చిరుత జనావాస ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ప్రజలపై ఎటువంటి కనికరం చూపించకుండా క్రూరంగా వేటాడే చంపుతుంది.అయితే హిమాచల్ ప్రదేశ్ లో చిరుత మాత్రం మనుషులతో ఆడుతోంది.

మనుషుల మీదకు ఎక్కి కొన్ని వింత వింత చేష్టలు చేస్తోంది.ఈ చిరుతపులి వింత ప్రవర్తన చూసి అటవీ అధికారులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తీర్థన్‌ వ్యాలీ ప్రాంతంలో కొందరు యువకులు ఓ గుంపుగా నిలబడి ఉండగా ఆ సమయంలో చిరుత రోడ్డు మీదకు వచ్చింది.అలా వచ్చిన చిరుత ఆ గుంపుగా నిలబడ్డ వ్యక్తుల దగ్గరికి మెల్లగా పులి వెళ్లగా వారంతా భయంతో పరుగులు పెట్టుకోగా ఓ వ్యక్తి మాత్రం అక్కడే కదలకుండా అతడి ఫోన్ లో ఆ చిరుత పులిని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే చిరుతను చూసి పరుగులు పెట్టిన ప్రజలందరూ ఆ వ్యక్తిని చిరుతపులి కచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది అని భావించినా.

చివరికి, ఆ వ్యక్తితో ఆ చిరుతపులి ఆడటం మొదలు పెట్టడంతో అక్కడి ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు.అతడి మీదకు చేరి పైకి ఏమి చేయకుండా అతడితో ఆడుకోవడం మొదలు పెట్టింది.

ఈ వింత సంఘటనలు కొందరు అక్కడ ఉన్నవారు వీడియో తీసి వాటిని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.ఈ వీడియోను ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పోస్ట్ చేయగా మరింత వైరల్ గా మారింది.

అయితే చిరుత పులి చేసిన ప్రవర్తన చూస్తే దానిని ఎవరో పెంపుడు జంతువుగా పెంచి ఉంటారని.అందుకే ఆ చిరుతపులి అలా ప్రవర్తిస్తుందని కొందరు ఇండియన్ ఫారెస్ట్ అధికారులు అభిప్రాయం తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube