బంగారం కోసం వెతకగా దొరికిన పెద్ద రాయి.. తీరా చూస్తే..?!

A Large Stone Found In Search Of Gold If You Look Further

వెతకబోయిన తీగ కాలుకు చిక్కుకోవడం అంటే ఇదే కాబోలు.అయితే ఇక్కడ వెతకబోయిన వస్తువు మాత్రం దొరకలేదు కానీ మరొక వస్తువు దొరికింది.

 A Large Stone Found In Search Of Gold If You Look Further-TeluguStop.com

కానీ ఆ దొరికిన వస్తువు అతని జీవితాన్నే మార్చేసింది.సరిగ్గా ఇలాంటి ఒక విచిత్రమైన ఘటన ఆస్ట్రేలియాలో ఉంటున్న ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంటుంది.

అయితే అతను ఒక వస్తువు కోసం వెతుకులాట ప్రారంభించగా అతనికి మరొక వస్తువు దిరికింది.దానిని పారవేయడం ఎందుకులే అనుకుని తన దగ్గర భద్రంగా దాచిపెట్టుకున్నాడు.

 A Large Stone Found In Search Of Gold If You Look Further-బంగారం కోసం వెతకగా దొరికిన పెద్ద రాయి.. తీరా చూస్తే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు ఆ వస్తువే అతనికి అదృష్టాన్ని తెచ్చిపెట్టేదని తెలిసి ఆ వ్యక్తి ఆశ్చర్యంలో మునిగిపోయాడు.అసలు ఆ వ్యక్తి అంతలా ఆశ్చర్యపోయే ఆ వస్తువు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాలో ఉంటున్న డేవిడ్ హోల్ అనే 2015లో మెల్బోర్న్ సమీపంలోని మేరీబరో రీజినల్ పార్క్‌లో బంగారం కోసం వెతకడానికి వెళ్లాడు.అక్కడి ప్రదేశం పందొమ్మిదవ శతాబ్దంలో బంగారు ‘గని’గా పేరు గాంచింది.

కొంతమందికి అక్కడ బంగారం కూడా లభించడంతో డేవిడ్ హోల్ కూడా బంగారం వెతకడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు.బంగారం కోసం వెతుకుతున్నప్పుడు అతనికి బంగారం బదులు ఒక వింత రాయి ఒకటి కనిపించింది.

ఆ రాయిని చూసి ఇదేదో బాగుంది ఆ రాయిని జాగ్రత్తగా తన ఇంటికి తీసుకెళ్లి కొన్ని రోజుల పాటు అతని దగ్గరే ఉంచుకున్నాడు.కొన్ని రోజుల తరువాత అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు.

ఎందుకంటే అది రాయి కాదు.అది ఒక పురాతన ఉల్క అని, 4.6 బిలియన్ సంవత్సరాల నాటిది అని పరిశోధనల్లో తెలిసింది.ఉల్క బరువు సుమారు 17 కిలోగ్రాములు ఉందట.

Telugu Gold, Latest News, Mysterious Stone, Seracing, Viral Latest, Viral News-Latest News - Telugu

మొదట్లో డేవిడ్ ఆ రాయిలో నగ్గెట్స్ ఉన్నాయని భావించి దానిని పగలగొట్టడానికి చూసాడు.కానీ ఆ రాయి పగలలేదు.ఇంకా ఆ రాయి గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేసాడు.అలా ఆరేళ్లపాటు ఆ బండ రాయిపై దుమ్ము చేరుతూనే ఉంది.కాగా ఇటీవల ఒక రోజు డేవిడ్‌ కు ఆ శిల గురించి గుర్తు వచ్చింది.ఇది ఎందుకన్నా పనికి వస్తుందేమో అని అనుకుని దానిని మెల్‌బోర్న్ మ్యూజియానికి తీసుకెళ్లాడు.

అక్కడ అతనికి తన దగ్గర ఉన్న వింత రాయి ఒక అరుదైన ఉల్క అని తెలుసుకున్నాడు.మ్యూజియం లోని జియాలజిస్ట్ డెర్మోట్ హెన్రీ ది సిడ్నీ ఈ ఉల్క గురించి ఇలా చెప్పుకొచ్చారు.

విక్టోరియాలో కనుగొన్న 17వ ఉల్క ఇది అని చెప్పారు.అలాగే ఈ ఉల్కల వలన మన సౌర వ్యవస్థకు సంబందించిన విషయాలు తెలుసుకోవచ్చు అని అన్నారు.

డేవిడ్ హోల్ తెలియకుండా కనిపెట్టిన ఈ ఉల్కకు ‘మేరీబరో’ అని పేరు కూడా పెట్టారు.ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉన్నారు కదా.డేవిడ్ హోల్ ఏ ప్రదేశంలో అయితే ఈ ఉల్కను కనిపెట్టాడో ఆ ప్రదేశం పేరునే ఈ ఉల్కకు పెట్టారన్నమాట.

#Stone #Gold

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube