Singarayakonda Hanuman : భక్తి శ్రద్ధలతో ఆంజనేయ వ్రతం.. ఎలా జరిగిందంటే..

ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ వ్రతం సందర్భంగా సోమవారం సింగరాయకొండ లో పెద్ద సంఖ్యలో భక్తులు ఇరుముడలను సమర్పించారు.బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలలోని పలు గ్రామాల నుంచి సుమారు 200 మంది ఆంజనేయ స్వామి భక్తులు మండల దీక్షలు ముగించుకుని ఇరుముడలతో ఆదివారం సాయంత్రం సింగరాయకొండకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేశారు.

 A Large Number Of Devotees In Singarayakonda  ,  Singarayakonda, Devotees , Hanu-TeluguStop.com

అంతేకాకుండా దేవాలయంలోని ఆంజనేయ స్వామి వ్రతం సందర్భంగా సోమవారం ఉదయం శుభ్రభాత సేవ, గోపూజ, అభిషేకం లాంటి ఎన్నో కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు.

ఆ తర్వాత ఆంజనేయ స్వామి దీక్ష భక్తులతో ఆలయ ప్రదక్షిణలు చేశారు.

భక్తులు సమర్పించిన ఇరుముడి ద్రవ్యాలతో ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకం చేశారు.పంపా పూజా, హనుమాన్ వ్రతం మన్య సూక్త హోమం, పూర్ణాహుతి లాంటి ఎన్నో కార్యక్రమాలను అత్యంత వైభవంగా చేశారు.

ప్రధాన పూజారి లక్ష్మీనారాయణ కూడా ఆంజనేయ స్వామి మాల ధరించి సోమవారం స్వామివారికి ఇరుముడిని సమర్పించారు.ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి దీక్ష భక్తుల హనుమాన్ నామస్మరణంతో సింగరాయకొండ పుణ్యక్షేత్రం మార్మోగిపోయింది.

Telugu Anjanya Swammy, Bapatla, Devotees, Devotional, Hanuman, Prakasam, Singara

ఇంకా చెప్పాలంటే చైర్మన్ కోటా శ్రీనివాసకుమార్, ఈవో సుభద్ర సిబ్బంది ఆధ్వర్యంలో ఈ దీక్షను ఎంతో భక్తి శ్రద్ధలతో అవసరమైన ఏర్పాట్లను ఏర్పాటు చేశారు.దీక్ష భక్తులకు పాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో భక్తితో ఏర్పాటు చేశారు.హనుమంత్ వ్రతం సందర్భంగా సోమవారం అద్దంకి పట్టణంలోని శ్రీ చక్ర చాహిత శ్రీ వాసవి కళ్యాణ్ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో భక్తులు 27 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మరో విశేషం.ప్రతి సంవత్సరం ఈ హనుమాన్ వ్రతం కార్యక్రమాన్ని ఎన్నో గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఎంతో విజయం గా పూర్తి చేస్తూ ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube