'గాంధీ జయంతి' ప్రాజెక్ట్ చేసుకురమ్మని స్కూల్ లో అంటే..ఆ చిన్నారి ఎంత కొంపముంచే పని చేసిందో తెలుసా.?

నేటి త‌రుణంలో స్కూళ్ల‌లో చిన్నారుల‌కు ప‌లు ర‌కాల అంశాల‌పై ప్రాజెక్టులను ఇస్తున్నారు తెలుసు క‌దా.అవును, అవే.

 A Kid Using 2000 And 500 Rupee Notes For Gandhi Jayanti Project-TeluguStop.com

అయితే ఏ ప్రాజెక్టు అయినా దానికి కావ‌ల్సిన ఫొటోలు, స‌మాచారాన్ని విద్యార్థులు సేక‌రించి అన్నింటినీ ఒక్క చోట చేర్చి ప్రాజెక్టు స‌మ‌ర్పించాలి.అందులో భాగంగానే ఓ చిన్నారి ఏం చేసిందో తెలుసా.? అక్టోబ‌ర్ 2 గాంధీ జ‌యంతి ప్రాజెక్టు ఇచ్చార‌ని చెప్పి గాంధీ బొమ్మ‌ల కోసం ఏకంగా క‌రెన్సీ నోట్ల‌నే క‌ట్ చేసింది.అనంత‌రం ఆ బొమ్మ‌ల‌ను కార్డు బోర్డుపై అంటించింది.

దానిపై అక్టోబ‌ర్ 2, గాంధీ జ‌యంతి అని రాసింది.కింద ఇచ్చిన చిత్రంలో ఉన్న‌దే ఆ ఫొటో.

ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్‌లో తెగ వైర‌ల్ అవుతోంది.

ఎవ‌రు తీశారో, ఏ ప్రాంత‌మో తెలియ‌దు కానీ ఈ ఫొటో మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంచ‌లనంగా మారింది.ఆ చిన్నారి అలా క‌రెన్సీ నోట్ల‌పై ఉన్న గాంధీ బొమ్మ‌ల‌ను క‌ట్ చేసి ఎంచ‌క్కా కార్డు బోర్డుపై అంటించ‌డాన్ని మ‌నం క్లియ‌ర్‌గా చూడ‌వ‌చ్చు.మొత్తం 8 రూ.2వేల నోట్లు, 6 రూ.500 నోట్ల‌ను ఆ చిన్నారి క‌ట్ చేసింది.అనంత‌రం వాటిని కార్డు బోర్డుపై అంటించింది.ఆ పైన అక్టోబ‌ర్ 2, గాంధీ జ‌యంతి అని రాసింది.అయితే ఆ చిన్నారి క‌ట్ చేసిన క‌రెన్సీ నోట్లు ఒకే సీరియ‌ల్ నంబ‌ర్‌ను క‌లిగి ఉన్నాయ‌ట‌.

దీంతో కొంద‌రు ఏమంటున్నారంటే.

ఎవ‌రో కావాల‌ని ఇలా చేశార‌ని, క‌రెన్సీ నోట్ల‌ను క‌ల‌ర్ జిరాక్స్ తీసి ఆ చిన్నారికి ఇచ్చి ఉంటార‌ని అంటున్నారు.ఇంకొంద‌రు నోట్లు నిజ‌మేన‌ని, చిన్నారికి తెలియ‌క అలా చేసి ఉంటుంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఏది ఏలా ఉన్నా ఒక వేళ అవి నిజం నోట్ల‌యితే శిక్ష త‌ప్ప‌దు.ఎందుకంటే క‌రెన్సీ నోట్లు ప్రామిస‌రీ నోట్‌, లీగల్ బాండ్‌కు స‌మానం.

కరెన్సీ నోట్ల‌ను జ‌నాలు వాడుకునేందుకు మాత్ర‌మే హ‌క్కు ఉంటుంది కానీ వారు ఆ నోట్ల‌కు య‌జ‌మానులు కారు.వారు నోట్ల‌ను అలా క‌ట్ చేయ‌డం, కాల్చ‌డం, చింప‌డం వంటి ప‌నులు చేయ‌రాదు.

క‌రెన్సీ నోట్ల‌పై పూర్తి హ‌క్కులు కేంద్ర ప్ర‌భుత్వానికే ఉంటాయి.ఏది ఏమైనా ఆ చిన్నారి అలా నోట్ల‌ను క‌ట్ చేసి గాంధీజీ బొమ్మ‌ల‌ను సేక‌రించి అంటించ‌డం నిజంగా షాకింగ్‌గా ఉంది క‌దా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube