ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న దినేష్ అరోరా అఫ్రూవర్ గా మారాడని తెలుస్తోంది.
ఈ క్రమంలో దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలని కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.ఈ నేపథ్యంలో సీబీఐ పిటిషన్ ను ఇవాళ న్యాయస్థానం విచారించనుంది.
ఎఫ్ఐఆర్ ప్రకారం, సమీర్ మహేంద్రు రూ.కోటి నగదును అరోరా నిర్వహిస్తున్న రాధా ఇండస్ట్రీస్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు.దినేష్ అరోరాతో పాటు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో పాటు మరికొందరిపై ఐపీసీ సెక్షన్ 120 బీ, 477 ఏ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.సీబీఐ పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఇవాళ విచారణ జరిపే అవకాశం ఉంది.