ఆత్మహత్యలకు అడ్డాగా మారిన అడవి... ఆ అడవి ఎక్కడుందో తెలుసా...?

ఆత్మహత్య మహాపాపం.ఇది అందరికీ తెలిసిన విషయమే.

 A Jungle That Has Become A Haven For Suicides  Forest, Japan, Suicided, Animals,-TeluguStop.com

కాకపోతే, రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిన్న చిన్న కారణాల నేపథ్యంలోనే ఆత్మహత్యలు చేసుకునే ప్రజలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయారు.అయితే వివిధ దేశాలలో, వివిధ ప్రాంతాలలో కొన్ని స్థలాలు ఆత్మహత్యలకు అడ్డాగా మారుతున్నాయి.

అయితే అలాంటి ప్రాంతమే ఒకటి జపాన్ దేశంలో ఉంది.జపాన్ దేశ రాజధాని టోక్యో నుండి కేవలం రెండు గంటల ప్రయాణం చేస్తే అవుకిగహారా అనే అటవీ ప్రాంతానికి చేరవచ్చు.

అయితే ఆ దేశ ప్రజలు ఆ అడవిని సూసైడ్ ఫారెస్ట్ గా పరిగణిస్తారు.ఈ అడవిలో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు ఎక్కువైపోయాయి.

ఇక ఆ అడివి ప్రాంతం ఏకంగా 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది.కాకపోతే ఆ అడవిలోకి ఎంటర్ అయితే తెలుస్తుంది అసలు విషయం.

ఆ అడవిలోకి అడుగుపెడతానే అనేక శవాలు అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి.వన్యమృగాలు వాటిని తినేసిన కళేబరాలు, అలాగే కొన్ని చోట్ల చెట్లకు వేలాడుతున్న మృతదేహాలు, మరికొన్ని చోట్ల చనిపోయినవారి వస్తువులు కనబడుతుంటాయి.

గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలాంటి సంఘటనలు ప్రతి సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉంటున్నాయట.ఎవరికైనా జీవితంలో విరక్తి చెందిన చాలామంది అడవికి చేరుకుని అక్కడ చెట్లకు ఉరి వేసుకుంటారట.

ఇలా అదే అడవికి వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం.ఆదేశ పురాణాల ప్రకారం ఆ అడవిలో ఉండే చెట్లకు ఉరి వేసుకుంటే వారు మృతి చెందిన తర్వాత వారికి అతీత శక్తులు వస్తాయని నమ్మకం.

ఆ గుడ్డి నమ్మకం వల్లనే ఆ అడవిలో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ప్రస్తుతం అడవిని దయ్యాల నివాసంగా అక్కడి వారు పేర్కొంటున్నారు.

అడవిలో తరచుగా అక్కడి పోలీసులు, కొంతమంది వాలంటరీలు అడవిలో ఉన్న శవాల కోసం గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు.అలా సేకరించిన శవాలను గుర్తిస్తే గనక వారి కుటుంబానికి వాటిని అప్పగిస్తారు.

ఈ అడవికి మరో లక్షణం కూడా ఉందండోయ్.అదేమిటంటే ఆ అడవిలో ఎలాంటి సిగ్నల్స్ ఉండవట.

దీనికి కారణం ఆ అడవిలో ఉన్న భూభాగంలో అయస్కాంత లక్షణాలు ఉన్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube