ఒక్క ట్వీట్ తో యువకుడికి ఉద్యోగం.. నవీన్ పోలిశెట్టి గొప్ప మనసు!

టాలీవుడ్ యంగ్ హీరోనవీన్ పోలిశెట్టి ప్రస్తుతం మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.గత ఏడాది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 A Job For A Young Man With A Single Tweet Naveen Polisetti Has A Great Mind-TeluguStop.com

ఈ సినిమాకు అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.ఈ సినిమా తర్వాత జాతి రత్నాలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే ఒక్క ట్వీట్ తోనే గొప్ప మనసును చూపాడు నవీన్ పొలిశెట్టి.

 A Job For A Young Man With A Single Tweet Naveen Polisetti Has A Great Mind-ఒక్క ట్వీట్ తో యువకుడికి ఉద్యోగం.. నవీన్ పోలిశెట్టి గొప్ప మనసు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ని మొదలు పెట్టిన నవీన్ పోలిశెట్టి చిచోరే అనే హిందీ సినిమాలో నటించాడు.

ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో మంచి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఈ సినిమాకు అందుకున్న విజయం తరహాలో జాతి రత్నాలు సినిమాలో కూడా అందుకున్నాడు.

ఇదిలా ఉంటే నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా కూడా నిలిచాడు.

Telugu Agant Srinivas, Help, Jathi Rathanalu, Naveen Polisetti, Sai Srinivas, Tolllywood, Twitter, Youtube-Movie

కోవిడ్ సమయంలో తన వంతు సహాయంతో ముందుకు వచ్చాడు.ఎంతో మంది ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలిచాడు.తాజాగా లాక్ డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన సమీర్ అనే ఓ యువకుడు ఇబ్బందుల్లో ఉన్న విషయం నవీన్ పొలిశెట్టి కి చేరగా వెంటనే తన వంతు సహాయంతో ముందుకు వచ్చాడు.

సమీర్ కు సంబంధించిన వివరాలు ట్విట్టర్ లో ట్వీట్ చేయగా వెంటనే ఆ ట్వీట్ కు స్పందించాడు నవీన్ పోలిశెట్టి.

Telugu Agant Srinivas, Help, Jathi Rathanalu, Naveen Polisetti, Sai Srinivas, Tolllywood, Twitter, Youtube-Movie

దీంతో అతనికి ఈ వోక్ వేగాన్ స్టోర్ అండ్ కేఫ్లో స్టోర్ కం కేఫ్ మేనేజర్ గా ఉద్యోగాన్ని అందించాడు.ఇక ఈ విషయాన్ని నవీన్ తన ట్విట్టర్ వేదికగా ‘ఈ వోక్ వేగాన్ స్టోర్ అండ్ కేఫ్’ పంపిన ఆఫర్ లెటర్ ను పోస్ట్ చేయగా.త్వరలోనే ఈ స్టోర్ కు తాను వెళ్తాను అని ట్వీట్ చేశాడు.

ఇక ఈ ట్వీట్ కు స్పందించిన నెటిజన్లు నవీన్ పొలిశెట్టి గొప్ప మనసును చాటుకున్నారు.ఇక సమీర్ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన చరణ్, సౌమ్య లకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు.

అంతేకాకుండా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని అనుకుంటున్నాడు నవీన్ పొలిశెట్టి.

#Sai Srinivas #Youtube #Jathi Rathanalu #Twitter #Help

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు