నకిలీ ఐటీ అధికారుల వలలో చిక్కిన నగల షాప్ ఓనర్.. రెండున్నర కిలోల బంగారంతో పరార్..!

కాలం మారుతున్న కొద్దీ దొంగతనాలు( thefts ) చేసే తీరు కూడా మారుతోంది.గతంలో దొంగతనం చేసే వ్యక్తులు తాళం ఉండే ఇళ్లను టార్గెట్ చేసేవారు.

 A Jewelery Shop Owner Caught In The Trap Of Fake It Officials Escaped With Two A-TeluguStop.com

టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమంలో నిలువు దోపిడీలు అధికం అయ్యాయి.ఒకపక్క సైబర్ మోసాలు( Cyber ​​fraud ).మరొకపక్క చేతిలో ఉన్న సొమ్ము ను క్షణాల్లో మాయం చేసే సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు పెరుగుతూ పోతున్నారు.ఇలాంటి కోవలోనే పట్టపగలు హైదరాబాద్ నగరంలోని ఓ నగల షాపులోకి చొరబడి తాము ఐటీ అధికారులం( IT officers ) అంటూ దర్జాగా రెండున్నర కిలోల బంగారాన్ని అపహరించారు.

అసలు ఏం జరిగిందో పూర్తిగా చూద్దాం.

Telugu Hyderabad, Officers, Jewelery Shop, Latest Telugu, Monda-Latest News - Te

వివరాల్లోకెళితే.హైదరాబాద్ నగరంలోని మోండా మార్కెట్లో ఉండే హర్ష జ్యువెలర్స్ లోకి నలుగురు వ్యక్తులు వెళ్లి తాము ఐటీ అధికారులమంటూ పరిచయం చేసుకున్నారు.ఈ జ్యువెలర్స్ షాప్ ను తనిఖీ చేయాలంటూ చాలా హంగామా చేశారు.

తర్వాత రెండున్నర కిలోల బంగారానికి బిల్లులు సరిగ్గా లేవని షాప్ యజమానిని భయభ్రాంతులకు గురిచేశారు.ఇక సమయం చూసుకొని ఆ రెండున్నర కిలోల బంగారాన్ని తీసుకొని పారిపోయారు.

Telugu Hyderabad, Officers, Jewelery Shop, Latest Telugu, Monda-Latest News - Te

హర్ష జ్యువెలర్స్ షాప్ యజమాని వెంటనే మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ పుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.సీసీ కెమెరాలను పరిశీలించగా నలుగురు వ్యక్తులు అచ్చం ఐటీ అధికారుల మాదిరిగానే ప్రవర్తిస్తూ ఎక్కడ కూడా తమపై చిన్న అనుమానం రాకుండా షాప్ యజమానితో పాటు పనిచేసే సిబ్బందిని నమ్మించి, సిబ్బందిని ఒక మూలన కూర్చోబెట్టి తనిఖీ చేస్తున్నట్లు నాటకం ఆడి దొంగతనం చేసినట్లు కెమెరాలలో రికార్డు అయింది.దొంగతనం చేసిన నలుగురు నిందితులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరం అంతా గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube