వీడియో: బోటు ప్రయాణికులకు షాకిచ్చిన భారీ తిమింగలం.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే..!

మహాసముద్రాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఎలాంటి సంఘటన చూడాల్సి వస్తుందో ఊహించలేం.సముద్రంపై వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంటుంది.

 A Huge Whale That Shocked The Boat Passengers Boat, Passengers, Shock, Latest Ne-TeluguStop.com

రాకాసి నౌకలలో ప్రయాణించే వారికి ఏం జరగదు కానీ చిన్న పడవలు, బోటులలో ప్రయాణించే వారికి చాలా రిస్కు.ఇప్పుడు మీరు సముద్రంలో బోటు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారని ఊహించుకోండి.

అకస్మాత్తుగా ఏదైనా రాకాసి జలచరం మీ పడవను కుదిపేస్తే ఎలా ఉంటుంది.పై ప్రాణాలు పైనే పోయాయి కదా.తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది.

ఒక భారీ తిమింగలం కొందరు పర్యాటకులు ప్రయాణిస్తున్న ఒక బోటుకు దగ్గరగా వచ్చింది.

ఆ ప్రాంతంలో ఆ తిమింగలం ఒక్కసారిగా పైకి లేచింది.మళ్లీ కిందికి దూకింది.

దాంతో ఒక పెద్ద భవనం కూలిపోతే ఎలా నీళ్లు పైకి ఎగసిపడతాయో అలా సముద్రపు నీళ్లు ఉవ్వెత్తున ఎగిసాయి.దీంతో బోటులో ఉన్న వారంతా ప్రాణ భయంతో వణికిపోయారు.

అదృష్టం కొద్దీ ఆ తిమింగళం బోటును ఢీ కొట్టలేదు కాబట్టి ఎవరికి ఏం జరగలేదు.లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది.

ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో మీరు గాల్లోకి ఎగురుతూ చక్కర్లు కొడుతున్న కొన్ని తిమింగలాలను చూడొచ్చు.మరుసటి క్షణం ఒక పెద్ద తిమింగలం ఒక బోటుకి సమీపముగా రావటం చూడొచ్చు.దాన్ని చూసి బోటులోని పర్యాటకులు బిగ్గరగా అరవటం గమనించవచ్చు.

క్షణాల్లో అది ఒక అంతస్తు అంత ఎత్తుకు పైకి లేచి మళ్లీ నీటి లోపలికి జంప్ చేయడం గమనించొచ్చు.ఈ క్షణ కాలం పాటు ప్రాణభయంతో వణికిపోయిన ప్రయాణికులు పెద్ద ఘడం నుంచి తప్పించుకున్నారు.

తర్వాత వారు ఆ అనుభూతికి థ్రిల్ కావడం మనం గమనించవచ్చు.అలాగే మరోవైపు కొన్ని తిమింగలాలు నీళ్లలో విన్యాసాలు చేస్తూ కనిపించాయి.

ఇవి ఉపరితలంపై ఆహ్లాదంగా సమయం గడుపుతున్నాయి.బోటులో షికారుకి వెళ్లిన పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం లేకుండా అద్భుతమైన అనుభూతి దక్కడం అదృష్టమనే చెప్పాలి.

బోట్ లోని పర్యాటకులు ఈ అందమైన వీడియో ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ వీడియో ఓషన్‌లైఫ్.4యు అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా పోస్ట్ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube