ఇద్దరు భారతీయులకు భారీ జాక్ పాట్...అక్షరాలా రూ....

కుటుంబ ఆర్ధిక పరిస్థితుల నేపధ్యంలో పొట్ట చేతబట్టుకుని దుబాయ్ వెళ్లి అక్కడ చిన్నా చితకా పనులు చేసుకుంటూ వచ్చిన సంపాదనలో కొంత ఖర్చులకు ఉంచుకుని మొత్తం సొంత దేశంలో ఉన్న కుటుంభం కోసం పంపే వారు ఎంతో మంది ఉన్నారు.ముఖ్యంగా వలస కార్మికులుగా భారత్ నుంచీ అరబ్బు దేశాలకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

 A Huge Jackpot For Two Indians Literally Rs , Rahul Ramanan, Johnson Jacob, A Huge Jackpot, Dubai Airport, Ala Farah Group, Indians-TeluguStop.com

అయితే ఎంతో మంది కార్మికులు వలస దేశాలలో నిర్వహించే లాటరీలలో తమ అదృష్టం పరీక్షుంచుకోవాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు.అయితే అత్యధిక శాతం లాటరీలు భారతీయులనే వరించడం మనం చూస్తూనే ఉంటాం.

తాజాగా దుబాయ్ లో నిర్వహించే దుబాయ్ ఫ్రీ లాటరీలో ఇద్దరు భారతీయులకు జాక్ పాట్ తగిలింది.రాహుల్ రామనన్, జాన్సన్ జాకబ్ అనే ఇద్దరు భారతీయులు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నిర్వహించిన లాటరీలో ఇద్దరూ కలిసి 2 మిలియన్ డాలర్లు గెలుచుకున్నారు.

 A Huge Jackpot For Two Indians Literally Rs , Rahul Ramanan, Johnson Jacob, A Huge Jackpot, Dubai Airport, Ala Farah Group, Indians-ఇద్దరు భారతీయులకు భారీ జాక్ పాట్#8230;అక్షరాలా రూ#8230;.-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇద్దరూ వేరు వేరు ప్రాంతాలలో రెండు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసారు.అయితే ఈ లక్కీ డ్రా ను దుబాయ్ ఎయిర్పోర్ట్ లో నిర్వహిస్తారని తెలుసుకుని వెళ్ళగా వారికి ఈ డ్రాలో ఒక్కొక్కరికి 1 మిలియన్ డాలర్లు లక్కీ డ్రా తగిలింది.1 మిలియన్ అంటే రూ.7 కోట్లు పైమాటే.ఒక్కసారిగా తమకు లాటరీ తగలడంతో ఉబ్బితబ్బిబ్బై పోయారు.ఎంతో కాలంగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షుంచుకుంటున్నానని అయితే ఏ నాడు తనను అదృష్టం వరించలేదని కానీ ఈ రోజు తమ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేసారు.

వీరిలో ఒకరు అల ఫరా గ్రూప్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తుండగా మరొకరు వేరే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు.ఊహించని విధంగా వచ్చిన సొమ్ముతో తమ ఆర్ధిక అవసరాలు తీర్చుకుంటామని, మంచి పనులకు ఉపయోగిస్తామని తెలిపారు.

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube