కారు ప్రమాదంతో కోమాలోకి వెళ్లిన చిన్నారి కి అమెరికన్ల భారీ సాయం

ఆనందంగా నవ్వులు చిందిస్తున్న ఆ కుటుంబం లోకి కారు రూపం లో ప్రమాదం ఎదురైంది.ఈ ఘటన అమెరికా లో చోటుచేసుకుంది.

 A Huge Help From Americans To The Nri Girl-TeluguStop.com

షాపింగ్ కి అని ఆ కుటుంబం బయటకు వచ్చింది.నవ్వుతూ,తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ షాపింగ్ చేసి బయటకు వచ్చిన ఆ కుటుంబాన్ని చూసి కన్ను కుట్టిన ఒక దుండగుడు కారు తో వచ్చి వారిని గుద్దేశాడు.

దీనితో ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ఆస్పత్రి పాలయ్యారు.అయితే గాయపడిన వారిలో 13 ఏళ్ల ధిర్తి నారాయణ్ కోమా లోకి వెళ్లడం తో ఆమె పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే ఆమె చికిత్స కు భారీ ఎత్తున ఖర్చు అవుతుంది అని వైద్యులు తెలపడం తో తల్లిదండ్రులు స్థోమత సరిపోలేదు.దీనితో ఆ చిన్నారి పరిస్థితి వివరిస్తూ తమకు ఎవరైనా సాయం చేయాలని కోరుతూ ‘గో ఫండ్ మీ’ అనే పేజీలో అభ్యర్ధించారు.

అంతే దీనితో అమెరికన్లు అందరూ కూడా ఆ చిన్నారికి సాయం అందించడానికి ముందుకు వచ్చారు.

దాదాపు 12,360 మంది దాతలు ముందుకు వచ్చి సాయం అందించడం తో ఇప్పుడు ఆ చిన్నారికి వైద్యం అందించటానికి సరిపడా మొత్తం సమకూరింది.

వారంతా కలిసి దాదాపు నాలుగు కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.అమెరికన్ల సాయం తో మా బిడ్డకు వైద్యం అందించగలుగుతున్నాం అంటూ ధిర్తి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

మరోపక్క ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఇసయ్య పీపుల్స్ గా గుర్తించారు.దీనితో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా వారంతా ముస్లిం కుటుంబం అనుకోని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులకు తెలిపినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube