వేటకు వెళ్లిన వ్యక్తిని ఈడ్చుకెళ్లిన భారీ చేప..!

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకొందరికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం.

 A Huge Fish Pulled Fisherman Into The Water, Viral Latest, News Viral, Social Me-TeluguStop.com

ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులులోకి చేపలు పట్టడానికి చాలా మంది వెళ్తుంటారు.పల్లెటూర్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

గాలాలు ఎత్తుకుని చేపలు పట్టడానికి యువత ముందుంటుంది.చేపలు పట్టాక ఇంటికి తెచ్చి వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు చేసుకుని లొట్టలేస్తూ తింటారు.

ఇక్కడ కూడా ఓ వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళాడు.అయితే అతడిని ఓ చేపే లాక్కెళ్ళింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన సోమోగీ కౌంటీలో జరిగింది.

వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో అది కాస్తా ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది.గత నెలలో హర్సాస్‌ బర్కి సరస్సు వద్ద చేపల వేటకు వెళ్లిన లోరెంట్ స్జాబో అనే వ్యక్తికి ఇలా జరిగింది.ఆ వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు ఓ చేప చిక్కింది.

66 కిలోలు ఉన్న ఆ చేపను చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు.అతను ఎంత ప్రయత్నించినా రాడ్డు రాలేదు.ఓ పెద్ద చేపే పడిందని అనుకున్నాడు.బలంగా తనవైపు లాగాడు.అయితే ఎంతకీ ఆ రాడ్డు రాలేదు.

చివరికి ఆ రాడ్డు అతన్ని నీళ్లల్లోకి లాక్కెళ్లింది.ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో ఏమో, ఏమైందో ఏమో అతనికి ఏమీ తెలియలేదు.

కొంత సమయానికి బురదలో పడిపోయాడు.సరస్సులో బాగా మునిగిపోయాడు.బట్టలన్నీ బురదతో నిండిపోయాయి.చివరకు అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో దీనిని చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు.ఇంకొందరేమో బతికి బట్ట కట్టాడంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకొందరేమో చేప బాగా బలంగా ఉన్నట్లు ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube